For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs SA: బెన్ స్టోక్స్ కమ్ బ్యాక్..!!

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్. ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ముంబై వాంఖెడే స్టేడియం వేదిక. ఈ రెండు జట్లకూ ఇది నాలుగో మ్యాచ్. మూడింట్లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఓ అడుగు ముందే ఉంది. మూడింట్లో రెండు పరాజయాలను చవి చూసింది ఇంగ్లాండ్.

వాంఖెడే స్టేడియంలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కేప్టెన్ జోస్ బట్లర్. అతని నిర్ణయం కరెక్టే అని తొలి ఓవర్‌లోనే తేలిపోయింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు. తొలి బంతిని ఫోర్‌కు తరలించి.. కాన్ఫిడెంట్‌‌గా కనిపించిన డికాక్- రెండో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

 CWC 2023, ENG vs SA: Ben Stokes return in World Cup 2023 againstSouthAfrica

బౌలర్ రీస్ టోప్లే వికెట్లకు కాస్త దూరంగా సంధించిన బంతిని కవర్ డ్రైవ్ ఆడబోయాడు క్వింటన్ డికాక్. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్‌ను ముద్దాడిన బంతిని కీపర్ జోస్ బట్లర్ అందుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బట్లర్ ఆ బంతిని అందుకోవడాని కంటే ముందే అది నేలను తాకినట్టు భావించారు.

అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో థర్డ్ అంపైర్ అప్పీల్ చేసింది ఇంగ్లాండ్. బంతి గ్రౌండ్‌ను తాకకముందే దాన్ని ఒడిసిపట్టుకున్నట్లు తేలడంతో అవుట్ ఇచ్చాడు థర్డ్ అంపైర్. డికాక్ వికెట్ తరువాత దక్షిణాఫ్రికా పరుగులు చేయడానికి కాస్త చెమటోడ్చుతోంది. రెండు ఓవర్లకు వికెట్ నష్టానికి అయిదు పరుగులు చేసింది. రస్సీ వాన్‌డెర్ డుస్సాన్, రీజా హెండ్రిక్స్ క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది జులైలో వన్డే ఇంటర్నేషనల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు బెన్ స్టోక్స్. వరల్డ్ కప్ తొలి మూడు మ్యాచ్‌లకూ దూరం అయ్యాడు. అతని అవసరం పడటంతో మళ్లీ వెనక్కి పిలిపించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్.

Story first published: Saturday, October 21, 2023, 14:23 [IST]
Other articles published on Oct 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+