Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చేతులు కాలాక.. జట్టులో ప్రయోగాలు

Eng vs Ned: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇంగ్లాండ్ మరో మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనే గెలిచిన ఇంగ్లాండ్. రెండు పాయింట్లతో పదో స్థానానికి దిగజారింది.

ఇంగ్లాండ్ ఒకింత మెరుగ్గానే ఉంది ఇంగ్లాండ్‌తో పోల్చుకుంటే. ఏడు మ్యాచ్‌ల్లలో రెండింట్లో నెగ్గింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇది కాకుండా చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఈ రెండు జట్లకూ. నెదర్లాండ్స్ తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను, ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌తోనూ తలపడాల్సి ఉంది.

CWC 2023, ENG vs NED: England won the toss and opttobatfirst against the Netherlands

నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కేప్టెన్ జోస్ బట్లర్. ఇందులో ఒకట్రెండు మార్పులకు పూనుకుంది టీమ్ మేనేజ్‌మెంట్. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టొన్‌, బౌలర్ మార్క్‌వుడ్‌ను పక్కనపెట్టింది. వారిద్దరి స్థానంలో హ్యారీ బ్రూక్, అట్కిన్సన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది.

ఇంగ్లాండ్ తుదిజట్టులో- జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్‌లు చోటు దక్కించుకున్నారు.

నెదర్లాండ్స్‌లో- వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కేప్టెన్ వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఉన్నారు.

Story first published: Wednesday, November 8, 2023, 14:02 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+