Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌కు లాస్ట్ ఛాన్స్..!!

అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సమవుజ్జీల మధ్య గేమ్ ఇది. వరుస పరాజయాలతో ఇంగ్లాండ్ దాదాపుగా సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పుకొన్న దశలో జరుగుతున్న ఈ మ్యాచ్‌.. ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కేప్టెన్ జోస్ బట్లర్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తుదిజట్టులో ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇది వరకు మ్యాచ్‌లను ఆడిన టీమ్‌తోనే ఆస్ట్రేలియాను ఎదుర్కొంటోంది. గెలుపుపై పెద్దగా ఆశలేవీ పెట్టుకోనట్టే కనిపిస్తోంది ఇంగ్లాండ్.

CWC 2023, ENG vs AUS: England have won the toss and decided to bowl first againstAustralia

ఆరు మ్యాచ్‌లల్లో ఒకే ఒక్కటి గెలిచింది ఇంగ్లాండ్. అయిదింట్లో ఓడింది. ఇది ఏడవది. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి రెండంటే రెండు పాయింట్లే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిందీ 2019 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమ్. ఇక ముందు గెలుస్తామనే ఆశలు కూడా పెద్దగా లేనట్టే కనిపిస్తోంది.

ఆస్ట్రేలియా మాత్రం తుదిజట్టులో కీలక మార్పులకు పూనుకుంది. రెండు మార్పులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. అతని స్థానంలో కామెరాన్ గ్రీన్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకుంది. గాయపడ్డ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు బదులుగా మరో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్‌ను ఆడిస్తోందా టీమ్ మేనేజ్‌మెంట్.

CWC 2023, ENG vs AUS: England have won the toss and decided to bowl first againstAustralia

ఇంగ్లాండ్ తుదిజట్టులో- జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ ఆడుతున్నారు.

ఆస్ట్రేలియా టీమ్‌లో- డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాంబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌కు చోటు దక్కింది.

Story first published: Saturday, November 4, 2023, 14:11 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+