For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో దబాంగ్, భజరంగి భాయిజాన్ క్యారెక్టర్లు ఎవరికి సూట్ అవుతాయో చెప్పిన సల్మాన్ ఖాన్

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ దూకుడు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు విజయాలతో ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. భారత్ తరువాత న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. ఈ నెల 19వ తేదీన పుణేలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రత్యర్థి జట్టు ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడం వల్ల వరుసగా నాలుగో విజయంపై భారత జట్టు కన్నేసినట్టే.

CWC 2023: Dabangg character suits Virat Kohli and Bajrangi Bhaijaan for Rohit Sharma, says Salman Khan

2019 తరహాలోనే ఇప్పుడు కూడా రోహిత్ శర్మ ప్రతాపం చూపిస్తోన్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో 217 పరుగుల చేశాడీ హిట్ మ్యాన్. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. సున్నాకే వెనుదిరిగాడు. జీరోతో ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభించినప్పటికీ ఆ తరువాత రోహిత్ శర్మ దూకుడు బ్రేకుల్లేవ్.

ఆఫ్ఘనిస్తాన్‌పై 131 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ టోర్నమెంట్‌లో సెంచరీల జైత్రయాత్రకు నాంది పలికాడు. పాకిస్తాన్‌పైనా విరుచుకుపడ్డాడు రోహిత్. 86 పరుగులు చేశాడు. తృటిలో సెంచరీని మిస్ అయ్యాడు. ఈ దూకుడు బంగ్లాదేశ్‌పైనా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు విరాట్ కోహ్లీ సైతం చెలరేగుతున్నాడు. రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో సగటున 50 పరుగులు చేశాడు. 156 పరుగులతో ఆడుతున్నాడు కోహ్లీ. ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పైనా హాఫ్ సెంచరీ అందుకున్నాడు 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే ఊపును పాకిస్తాన్‌పై కొనసాగించలేకపోయాడు. 16 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

వారిద్దరి దూకుడుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యాడు. తన సినిమాల్లోని క్యారెక్టర్లతో పోల్చాడు. విరాట్ కోహ్లీకి దబాంగ్‌ క్యారెక్టర్‌ సూట్ అవుతుందని వ్యాఖ్యానించాడు. ఆ సినిమాలో తాను పోషించిన పోలీస్ క్యారెక్టర్ లక్షణాలన్నీ కోహ్లీలోఉన్నాయని చెప్పాడు. ఆ క్యారెక్టర్‌లో ఉండే దూకుడు స్వభావం కోహ్లీ వ్యక్తిత్వానికి సరిపోతుందని పేర్కొన్నాడు.

కోహ్లీ శారీరకంగా, మానసికంగా చాలా ఫిట్‌గా ఉంటాడని సల్మాన్ ఖాన్ కితాబిచ్చాడు. క్రీజ్‌లో, ఫీల్డ్‌లో ఉన్నప్పుడు వంద శాతం అంకితభావం, చిత్తశుద్ధిని చూపుతాడని పేర్కొన్నాడు. తన టాస్క్ ఏమిటీ? టీమిండియాలో తన రోల్ ఎలాంటిదనేది కోహ్లీకి బాగా తెలుసునని, దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి పూర్తి ఎఫర్ట్స్ పెడతాడని చెప్పాడు సల్మాన్ ఖాన్.

భజరంగి భాయిజాన్ క్యారెక్టర్ రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుందని సల్మాన్ వివరించాడు. రోహిత్ శర్మ ఓ అద్భుతమైన ఆటగాడని ప్రశంసించాడు. కేప్టెన్సీ అనే బరువును మోస్తూ, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చాలనే తపన రోహిత్ శర్మలో ఉందని వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, October 17, 2023, 10:28 [IST]
Other articles published on Oct 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+