For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంత పని చేస్తివిరా.. లాథమ్!!

David Warner and Travis Head: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్. ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ గేమ్ మొదలైంది. సమవుజ్జీల మధ్య పోరు ఇది. స్టేడియంలో పరుగుల వరద పారుతోంది.

టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించింది. అదే ఆ జట్టు చేసిన తప్పు. ధర్మశాల పిచ్‌ను తక్కువగా అంచనా వేసినట్టున్నాడు ఆ జట్టు కేప్టెన్ టామ్ లాథమ్. ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత పొరపాటో అతనికి తొలి ఓవర్‌లోనే తెలిసి ఉండొచ్చు.

CWC 2023, AUS vs NZ: Australia eyes huge target as Warner and Headslamsfifties

తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. మాట్ హెన్రీ వేసిన ఆ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ రెండు బౌండరీలను సాధించాడు. స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. అక్కడ మొదలైన జడివాన.. సునామీలా మారింది. న్యూజిలాండ్ బౌలర్లను నిలువునా ముంచేసింది.

సునామీలా విరుచుకుపడుతున్నారు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. సెంచరీ దిశగా సాగుతున్నారు. పోటీ పడి పరుగులు పిండుకుంటోన్నారు వారిద్దరూ. ఒకదశలో 59 బంతుల్లో ఆరు సిక్సర్లు, అయిదు ఫోర్లతో వార్నర్ 77 పరుగులు చేయగా, అదే 77 పరుగులను చేయడానికి ట్రావిస్ హెడ్ తీసుకున్నది 45 బంతులే. అతని ఖాతాలో అయిదు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు ఉన్నాయి.

CWC 2023, AUS vs NZ: Australia eyes huge target as Warner and Headslamsfifties

28 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 25 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. తొమ్మిదికి పైగా రన్‌రేట్‌తో స్కోర్ బోర్డ్‌ను ఉరకలెత్తిస్తోన్నారు ఓపెనర్లు. వార్నర్, హెడ్ 77 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు.

Story first published: Saturday, October 28, 2023, 11:52 [IST]
Other articles published on Oct 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+