For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ సెంచరీ హీరో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడట్లేదు..!!

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

రెండోది- మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో. ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇవే చివరి మ్యాచ్‌లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్.. సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలిగాయి.

CWC 2023, AUS vs BAN: Glenn Maxwell and Mitchell Starc rested against Bangladesh

బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్. బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి రెండు ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్జీద్ హసన్, లిట్టన్ దాస్ క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌ కోసం జట్టులో రెండు మార్పులు చేసింది ఆసీస్. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. అది ఎలాంటి ప్రభావాన్ని చూపేది కాకపోవడం వల్ల మార్పులు చేపట్టింది. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తుదిజట్టులోకి తీసుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్‌ను కూడా దూరం పెట్టింది.

వారిద్దరికీ విశ్రాంతి ఇచ్చింది. వారిద్దరి స్థానంలో మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్‌ను తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడిన మ్యాచ్‌ సందర్భంగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయపడ్డ విషయం తెలిసిందే. కాలి కండరాలు పట్టేయడంతో అతను పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. క్రీజ్‌లో సరిగ్గా నిల్చోనూ లేకపోయాడు.

CWC 2023, AUS vs BAN: Glenn Maxwell and Mitchell Starc rested against Bangladesh

సరైన ఫుట్ వర్క్‌ను ప్రదర్శించలేకపోయాడు. అయినప్పటికీ.. ఆ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు మ్యాక్స్‌వెల్. 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ నొప్పి ఇంకా తలెత్తుతుండటం వల్ల మ్యాక్స్‌వెల్‌కు విశ్రాంతి ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్. అలాగే స్టార్క్ కూడా విశ్రాంతి తీసుకున్నాడు.

రెండో సెమీ ఫైనల్స్‌ ఈ నెల 16వ తేదీన షెడ్యూల్ అయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది ఆస్ట్రేలియా. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు- 15వ తేదీన భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్స్‌లో విజేతతో ఫైనల్స్‌లో ఆడాల్సి ఉంటుంది.

Story first published: Saturday, November 11, 2023, 10:52 [IST]
Other articles published on Nov 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+