For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

68 బంతుల్లో 12 రన్స్ చేసిన ఆసీస్ కేప్టెన్: ఎంత కొట్టామనేది కాదన్నియ్యా..!!

Pat Cummins: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్.. అతని కేరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ చేయడమే గొప్ప అనుకుంటే ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించేలా ఆ స్కోర్ చేయడం.. దాన్నిరెట్టింపు చేసింది.

91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో నిలిచిన జట్టును గెలిపించడానికి విధ్వంసకరమైన ఇన్నింగ్ ఆడాడు. ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు. కాలి పిక్కలు పట్టేయడం వల్ల కలిగిన నొప్పిని పంటి బిగువున భరిస్తూనే భారీ షాట్లు ఆడాడు. సరైన ఫుట్ వర్క్ లేకున్నా బంతులను బౌండరీ లైన్లు, ఫెన్సింగ్ దాటించాడు.

CWC 2023, AUS vs AFG: Pat Cummins scored 12 runs off 68 balls againstAfghanistan

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్‌లో 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు.. అతని సునామీ ఇన్నింగ్‌కు అద్దం పట్టాయి. 128 బంతుల్లో 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైనప్పటికీ.. ఓర్చుకున్నాడు. గెలుపే లక్ష్యంగా ఆడాడు. ఒంటికాలిపైనే శివాలెత్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అనే పదాలకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు.

అదే సమయంలో మరో ఎండ్‌లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్ ఇచ్చిన సహకారాన్ని ఎవరూ విస్మరించలేరు. ఏడో బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన కమ్మిన్స్ ఓపిగ్గా ఆడాడు. వికెట్ పడకుండా తనను తాను కాపాడుకోగలిగాడు. రషీద్ ఖాన్, నబీ, ఒమర్జాయ్.. వంటి బౌలర్లను తట్టుకుని క్రీజ్‌లో పాతుకుపోయాడు.

ఈ క్రమంలో పాట్ కమ్మిన్స్ టెస్ట్ మ్యాచ్‌ల కంటే జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 68 బంతులు అంటే 11.2 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిల్చోగలిగాడు. అతను చేసింది 12 పరుగులే అయినప్పటికీ.. ఎంతో విలువైనవి. కమ్మిన్స్ అవుట్ అయివుంటే ఆ తరువాతి బ్యాటర్లు ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.. వికెట్లను పడగొట్టడానికి ఆఫ్ఘన్ బౌలర్లకు ఎంతో సమయం పట్టి ఉండకపోవచ్చు.

ఈ పరిస్థితి రావొచ్చని పసిగట్టడం వల్లే పాట్ కమ్మిన్స్ జాగ్రత్తగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో 68 బంతుల్లో 12 పరుగులు చేయడంపై కమ్మిన్స్ మాట్లాడాడు. తన వికెట్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చానని వివరించాడు. తను అవుట్ అయితే తదుపరి బ్యాటర్‌గా ఆడమ్ జంపా రావాల్సి ఉంటుందని, రిథమ్ అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నాడు. కేప్టెన్‌గా తన బాధ్యతను తాను నిర్వర్తించానని నవ్వుతూ చెప్పాడు.

Story first published: Wednesday, November 8, 2023, 13:30 [IST]
Other articles published on Nov 8, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+