Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబుల్ సెంచరీపై మ్యాక్సీ మామ రియాక్షన్ ఇదే- అసలే చెడ్డపేరు..!!

Glenn Maxwell: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతున్న పేరు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్. అసలే మ్యాడ్ మ్యాక్సీ అనే పేరుందతనికి. వెనుకాముందు చూడకుండా బౌలర్లను ఉతికి ఆరేస్తాడని, విచక్షణారహితంగా ఊచకోతకు దిగుతుంటాడనీ అంటుంటారు ఫ్యాన్స్. అలాంటిది- తన జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఇక ఎలా ఆడతాడనేది ఓ ఊహగా ఉంటూ వచ్చింది. ఇప్పుడది నిజమైంది.

91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో నిలిచిన జట్టును గెలిపించడం అంటే మాటలు కాదు.. అది కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి జట్టును గెలిపించాడు మ్యాక్స్‌వెల్. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు.

CWC 2023, AUS vs AFG: Im proud of my knock, says Glenn Maxwell

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సమయోచితంగా ఆడటం కూడా మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చింది. వికెట్ పడకుండా తనను తాను కాపడుెకోగలిగాడు కమ్మిన్స్. ఈ క్రమంలో అతను ఏకంగా 68 బంతులను ఎదుర్కొన్నాడు. చేసింది 12 పరుగులే అయినప్పటికీ.. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్‌లో 10 భారీ సిక్సర్లు, 21 ఫోర్లు.. అతని సునామీ ఇన్నింగ్‌కు అద్దం పట్టాయి. 128 బంతుల్లో 157.03 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైనప్పటికీ.. ఓర్చుకున్నాడు. గెలుపే లక్ష్యంగా ఆడాడు. ఒంటికాలిపైనే శివాలెత్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించడం అనే పదాలకు అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు.

ఈ ఇన్నింగ్‌పై మ్యాక్స్‌వెల్ స్పందించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా అతను మాట్లాడాడు. ఇలాంటి ఇన్నింగ్ ఆడటాన్ని తన అదృష్టంగా భావిస్తోన్నానని, గర్వంగా ఉందని వ్యాఖ్యానించాడు. చివరి బంతి వరకూ క్రీజ్‌లో నిల్చోవాలని ముందే ప్లాన్ చేసుకున్నానని, వికెట్‌ను కాపాడుకుంటూ భారీ షాట్లను ఆడేలా బ్యాలెన్స్ చేసుకోవాలని భావించానని వివరించాడు. దీన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగానని చెప్పాడు.

ఫీల్డింగ్ చేస్తోన్నప్పుడు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డానని, ఈ ప్రభావం బ్యాటింగ్‌పై పడకుండా చూసుకోగలిగానని మ్యాక్సీ అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంపై డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ ప్లాన్ రూపొందించుకున్నామని, దానికే తాను స్టిక్ ఆన్ అయ్యానని, లక్ష్యాన్ని ఛేదించడానికి ఎలా ఆడాలనే విషయంపై తనకు పూర్తి స్పష్టత ఉందని చెప్పుకొచ్చాడు.

తొలుత లూజ్ బాల్స్‌ను మాత్రమే షాట్లుగా మలచాలని భావించానని, క్రీజ్‌లో కుదురుకున్నాక ఇక ఆలోచించాల్సిన అవసరం రాలేదని వివరించాడు. బంతి వికెట్ల కంటే ఎత్తుగా వెళ్తోందనే విషయం తెలిసినప్పటికీ.. ఎల్బీడబ్ల్యూ అప్పీల్ సమయంలో కొంత ఆందోళనకు గురయ్యానని చెప్పాడు. ఆ తరువాతే బౌలర్లపై ఎదురుదాడికి దిగానని అన్నాడు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు మ్యాక్స్‌వెల్. ఒక దశలో తమను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని, సగానికి పైగా మ్యాచ్‌లో బౌలర్లదే ఆధిపత్యం కొనసాగిందని ప్రశంసించాడు. తన జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చిన ఈ విజయంలో తాను కీలకంగా మారడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, November 8, 2023, 8:51 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+