For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ వేళ.. స్టార్ ప్లేయర్ సంచలనం..!!

Angelo Mathews: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అసాధారణ రీతిలో అవుట్ అయిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్. టైమ్ అవుట్ విధానంలో అతను వెనుదిరిగాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కొనకుండానే అవుట్ అయిన విధానం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

టైమ్ అవుట్ అమలులోకి తెచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా ఈ విధానంలో అవుట్ అయ్యాడు ఏంజెలో మాథ్యూస్. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను టైమ్ అవుట్‌‌గా వెనుదిరిగాడు. ఒక బ్యాటర్ అవుటైన తరువాత మరొకరు నిర్ణీత సమయంలో క్రీజులోకి రావాల్సి ఉంటుంది.

CWC 2023: 5 seconds left, Sri Lankas Angelo Mathews has submitted the proofstotheICC

ఆ గడువు దాటిన తరువాత క్రీజ్‌లోకి వచ్చే బ్యాటర్‌ను టైమ్ అవుట్‌గా ప్రకటించడం అనేది నిబంధన. ఇప్పుడు దీని కిందే మాథ్యూస్ అవుట్ అయ్యాడు. 146 సంవత్సరాల చరిత్ర ఉన్న క్రికెట్‌లో ఓ బ్యాటర్ టైమ్ అవుట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి సందర్భం చోటు చేసుకోలేదు.

ఇది దుమారం రేపుతోంది. ఇన్ టైమ్‌లోనే అతను గ్రౌండ్‌లోకి రావడం, బంతిని ఎదుర్కొనడంలో కొంత జాప్యం చేసినప్పటికీ.. అయిదు సెకెన్లు ఇంకా మిగిలివుండగానే తనను టైమ్ అవుట్‌గా ప్రకటించారని వాదిస్తోన్నాడు ఏంజెలో మాథ్యూస్. దీనికి అవసరమైన సాక్ష్యాధారాలను సైతం అతను సేకరించాడు.

వాటన్నింటినీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు పంపించాడు. కొన్ని టీవీ స్క్రీన్ షాట్లు, స్పోర్ట్స్ యాప్స్‌లో రికార్డయిన టైమ్‌ ప్రూఫ్స్‌ను అతను ఐసీసీకి అందజేశాడు. అయిదు సెకెండ్లు మిగిలివుండగానే తనను అంపైర్ టైమ్ అవుట్‌గా ప్రకటించారని స్పష్టం చేశాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, తమ డిమాండ్లను అంగీకరించాల్సి ఉంటుందని చెబుతున్నాడు.

Story first published: Tuesday, November 7, 2023, 12:16 [IST]
Other articles published on Nov 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+