Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్‌కు బదులు కార్తిక్‌ను ఎందుకు తీసుకున్నామంటే!!

ICC Cricket World Cup 2019 : Kohli Reveals Why Karthik Was Picked Over Pant In World Cup Team
CWC 2019: Virat Kohli Reveals Why Dinesh Karthik Was Picked Over Rishabh Pant In India World Cup Team

కీలక మ్యాచ్‌లో జట్టు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు దినేశ్‌ కార్తిక్‌ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచకప్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌కు బదులు సీనియర్ దినేశ్‌ కార్తిక్‌ను ఎంచుకున్నాం అని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తెలిపారు. మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ జట్టులో రెగ్యులర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీకి బ్యాక్ అప్ వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తిక్‌ను ఎంపిక చేశారుసె లెక్టర్లు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ జట్టును ప్రకటించినప్పటి నుండి పంత్ విషయంలో చాలా మంది మండిపడ్డాడు. వన్డే, టెస్టులలో అతను అద్భుతంగా ఆడుతున్నాడు.. అతనిని ఎందుకు తీసుకోలేదు అని చాలా మంది బాహాటంగానే ప్రశ్నించారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ పంత్ విషయంలో చాలా అసంతృపి వ్యక్తం చేసాడు. అయినా కెప్టెన్ విరాట్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

తాజాగా విరాట్ ఈ విషయంపై తొలిసారిగా స్పందించాడు. 'కీలక మ్యాచ్‌లో జట్టు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు దినేశ్‌ కార్తిక్‌ అనుభవం ఉపయోగపడుతుంది. తీవ్ర ఒత్తిడిలో దినేశ్‌ ఎన్నోసార్లు మ్యాచ్‌ను ముగించాడు. ఫినిషర్‌గానూ దినేశ్‌కు మంచి పేరుంది' అని కోహ్లీ తెలిపాడు. '15 మందిని జట్టుకు ఎంపిక చేయలేం. ఇది అంత సులభం కాదు. ఆటగాళ్లు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం రావొచ్చు' అని కోహ్లీ సూచించాడు.

'నా కెరీర్‌ ధోనీ సారథ్యంలోనే మొదలైంది. ఎప్పటినుండో అతనిని దగ్గర నుంచి చూస్తున్నాను. వికెట్‌ కీపర్‌గా టీమిండియాకు ధోనీ అందించిన సేవలు వెలకట్టలేనివి. ఎన్నో కీలక సమయాల్లో స్టంప్స్‌ వెనక ఉండి వికెట్లను తీశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ కూడా చూశాం. ప్రపంచకప్‌ జట్టులో ధోనీ ఉండటం ఎంతో అవసరం. ధోనీ సలహాలు, సూచనలు ముఖ్య భూమిక పోషిస్తాయి' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, May 15, 2019, 16:58 [IST]
Other articles published on May 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+