అనుష్కతో పెళ్లి... కెప్టెన్సీపై ఏ విధంగా ప్రభావం చూపిందంటే!: కోహ్లీ

హైదరాబాద్: బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పెళ్లి తన కెప్టెన్సీపై ఏ విధంగా ప్రభావం చూపిందో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. డిసెంబర్ 11, 2017న ఇటలీలో అనుష్క శర్మను విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తన జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంచిందని కోహ్లీ చెప్పాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గతంలో కంటే ఎంతో భిన్నంగా
పెళ్లి తనను మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చిందని, ముఖ్యంగా కెప్టెన్సీలో దాని ప్రభావం చాలా వరకు కనిపించిదని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "పెళ్లి తర్వాత మనం బాధ్యతాయుతంగా మారుతాం. గతంలో కంటే ఎంతో భిన్నంగా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పరిణతి పెరిగింది" అని కోహ్లీ చెప్పాడు.

కెప్టెన్‌గానే కాదు.. వ్యక్తిగా, ఆటగాడిగా
"చాలా విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండటం నేర్చుకున్నాను. కెప్టెన్‌గానే కాదు.. వ్యక్తిగా, ఆటగాడిగా మరింత మెరుగుపడ్డాను" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. కాగా, ఐసీసీ వరల్డ్‌కప్‌కు ముందు బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

కెప్టెన్‌గా కోహ్లీకి తొలి వరల్డ్‌కప్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో కోహ్లీసేన తన ఆరంభ మ్యాచ్‌ని జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి సౌతాంప్టన్ వేదిక కానుంది. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి వరల్డ్‌కప్ కావడం విశేషం.

బంగ్లాపై 95 పరుగుల తేడాతో విజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీసేన 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుంజుకుంది. ఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్ కోహ్లీ, రాహుల్, ధోనీలు చెలరేగారు. ముఖ్యంగా రాహుల్, ధోనీలు సరైన సమయంలో సెంచరీలు సాధించి భారీ స్కోర్ అందించారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, చాహల్‌లు బంగ్లాని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications