వివ్ రిచర్డ్స్ రికార్డు బద్దలు: కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఉపఖండం నుంచి అత్యంత వేగంగా 50 వన్డే విజయాలను సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2017లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ తర్వాత కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 69 వన్డేల్లోనే 50 విజయాలను సాధించాడు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వివ్ రిచర్డ్స్‌ను అధిగమించిన కోహ్లీ
తాజా విజయంతో వెస్టిండిస మాజీ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ను కోహ్లీ అధిగమించాడు. కెప్టెన్‌గా వివ్ రిచర్డ్స్ 70 మ్యాచ్‌లకు గాను 50 విజయాలను సాధించాడు. ఈ జాబితాలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ (63 మ్యాచ్‌ల్లో 50 విజయాలు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం క్లైవ్ లాయిడ్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

జట్టు విజయంలో రోహిత్ శర్మ కీలకపాత్ర
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోన్జే (68 మ్యాచ్‌ల్లో 50 విజయాలు) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ
వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 22 సెంచరీల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. భారత జట్టులో శిఖర్ ధావన్(8), కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), లోకేశ్ రాహుల్(26), ధోనీ(34), పాండ్యా(15) పరుగులు చేశారు. అంతకముందు టాస్ గెలిచి తోలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

కోహ్లీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "పిచ్ సవాల్ విసరడంతో మ్యాచ్ అద్భుతంగా సాగింది. రోహిత్‌కు హ్యాట్సాఫ్. టాస్ గెలిచి ఉంటే బౌలింగే చేసేవాళ్లం. బుమ్రా బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకున్న 15 నిమిషాల తర్వాత సైతం నా చేతులు సాధారణ స్థితికి రాలేదు. ఆమ్లాను అతడు ఔట్ చేసిన తీరును వన్డేల్లో నేనింతవరకు చూడలేదు. బుమ్రా ఓ ప్రత్యేక శ్రేణిలో ఉన్నాడని చెప్పొచ్చు. చహల్ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications