Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంఫైరింగ్ తప్పిదానికి క్రిస్ గేల్ బలి: సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్

CWC 2019: Umpiring TROLLED as Ball Before Chris Gayle Was Out Was No-Ball by Mitchell Starc During Windies

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అంఫైరింగ్ తప్పిదానికి బలయ్యాడు. మూడోసారి ఎల్బీగా ఔటవ్వడానికి ముందు క్రిస్ గేల్ రెండు రివ్యూలతో నాటౌట్‌గా బ్రతికిపోయాడు. అసలేం జరిగిందంటే..

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మిచెల్‌ స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతి గేల్‌ ప్యాడ్‌లకు తాకడంతో ఆసీస్ క్రికెటర్లు అప్పీల్‌ చేశారు. దీంతో అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించడంతో గేల్‌ రివ్యూకి వెళ్లాడు. అది నాటౌట్‌గా తేలింది. తర్వాతి బంతి కూడా ప్యాడ్లకు తగలడంతో మరోసారి అంపైర్‌ ఔటిచ్చాడు. మళ్లీ క్రిస్ గేల్‌ రివ్యూకి వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది.

ఒకే ఓవర్‌లో రెండుసార్లు స్టార్క్‌ చేతిలో

ఇలా ఒకే ఓవర్‌లో రెండుసార్లు స్టార్క్‌ చేతిలో ఎల్బీ నుంచి క్రిసే గేల్ తప్పించుకున్నాడు. అయితే, ఈసారి ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన మిచెల్ స్టార్క్ గేల్‌కు యార్కర్‌ సంధించాడు. బంతి ప్యాడ్లకు తాకింది. అంపైర్‌ మూడోసారీ ఔటివ్వగా గేల్‌ రివ్యూ కోరాడు. ఈసారి క్రిస్ గేల్‌కు అదృష్టం కలిసి రాలేదు.

రివ్యూలో లెగ్‌ స్టంప్‌ పక్కగా బంతిని తాకుతూ

రివ్యూలో లెగ్‌ స్టంప్‌ పక్కగా బంతిని తాకుతూ వెళ్లడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. ఇది అంపైర్‌ కాల్‌ నిర్ణయంపై కావడంతో అతడు నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇదిలా ఉంటే క్రిస్ గేల్‌ ఔటవ్వడానికి ముందు బంతిని స్టార్క్ నో బాల్‌గా వేశాడు. కానీ అంపైర్‌ గుర్తించలేదు. అదే అంపైర్ ముందు బంతిని నోబాల్‌గా ప్రకటించి ఉంటే, క్రిస్ గేల్ ఫ్రీహిట్‌ ఆడేవాడు.

క్రిస్ గేల్ నిరాశగా

అలా జరగకపోవడంతో క్రిస్ గేల్ నిరాశగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అంఫైర్ తప్పిదాలకు క్రిస్ గేల్ బలి కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అంపైరింగ్ చాలా చెత్తగా ఉంది. అన్ని నిర్ణయాలు తప్పుడివే. క్రిస్ గేల్ ఔటైన బంతికి ముందు స్టార్క్ నో బాల్ వేశాడు. అతడు ఔటైన బంతిని ప్రీ హిట్‌గా ఇవ్వాలి" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

మైఖేల్‌ హోల్డింగ్‌ అంపైర్‌ తప్పిదంపై

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ హోల్డింగ్‌ అంపైర్‌ తప్పిదంపై తీవ్రంగా విమర్శించారు. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న అతను దారుణంగా అంపైరింగ్‌ చేస్తున్నారని మండిపడ్డాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు పదేపదే అప్పీలింగ్‌ చేస్తే అంపైర్లు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలిపాడు.

Story first published: Friday, June 7, 2019, 12:58 [IST]
Other articles published on Jun 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+