
హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్), విరాట్ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఈ భారీ స్కోరుని ఆస్ట్రేలియా ఛేదిస్తుందా? లేదా అనే అనుమానం భారత అభిమానుల్లో నెలకొంది. గతంలో ఆస్ట్రేలియా 19 సార్లు 350 అంతకంటే ఎక్కువ స్కోరుని నమోదు చేసింది. ఇందులో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లోనే ఆరుస్లారు 350కిపైగా స్కోరుని అందుకుంది. కాగా, వన్డేల్లో ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు 431/4. 2006లో దక్షిణాఫ్రికాపై ఈ స్కోరుని నమోదు చేసింది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత 358 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో టీమిండియా మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అప్పటి మ్యాచ్‌లో కూడా ఓపెనర్ శిఖర్ ధావన్ (143) సెంచరీ సాధించాడు. మరి, ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందోనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. తొలి ఏడు ఓవర్ల నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు... ఆ తర్వాత ధావన్ పరుగుల వరద పారించాడు. కౌల్టర్ నైల్ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్ 14 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొవైపు రోహిత్ శర్మ అతడికి సహకారం అందిస్తు హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసిన ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఆసీస్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని ధావన్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 16వ వన్డే సెంచరీ. ఆ తర్వాత జట్టు స్కోరు 220 పరుగుల వద్ద శిఖర్ ధావన్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో హార్దిక్ పాండ్యా మూడో వికెట్‌గా ఔటయ్యాడు.1sq
ఆ తర్వాత వచ్చిన ధోని 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్‌లో స్కోరును పెంచే క్రమంలో కోహ్లీ(82) పరుగుల వద్ద ఔట్ కాగా, కేఎల్ రాహుల్ 3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ కొట్టడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, స్టార్క్, కౌల్టర్ నైల్‌లకు తలో వికెట్ లభించింది.
{headtohead_cricket_1_3}