Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంఫైర్ తప్పిదాలకు విండిస్ భారీ మూల్యం: గేల్ ఔటైన బంతికి ముందు నోబాల్

ICC Cricket World Cup 2019 : Gayle Given Out On A Delivery Which Should’ve Been A Free Hit
CWC 2019: The Ball before Gayle got out is a NO Ball

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ జట్టులో కౌల్టర్-నైల్(92; 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
విండిస్ బౌలర్లలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో షై హోప్‌ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్‌ పూరన్‌ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ హోల్డర్‌ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్‌) రాణించినా విండిస్ 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. స్టార్క్‌ (5/46) అద్భుత బౌలింగ్‌తో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రివ్యూకి వెళ్లిన క్రిస్ గేల్

రివ్యూకి వెళ్లిన క్రిస్ గేల్

దీనిని నాటౌట్‌గా భావించిన క్రిస్ గేల్ వెంటనే రివ్యూకి వెళ్లాడు. రివ్యూలో బంతి స్టంప్‌ను తాకలేదని తేలడంతో థర్డ్ అంఫైర్ క్రిస్ గేల్‌‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతికే మళ్లీ అంపైర్‌ అతడిని ఎల్బీగా ప్రకటించాడు. క్రిస్ గేల్‌ మరోసారి రివ్యూకి వెళ్లాడు. ఈసారి బంతి స్టంప్‌లకు మరింత దూరంగా వెళ్లిందని రివ్యూలో తేలడంతో రీప్లేలో తేలింది.

రివ్యూలో నాటౌట్‌గా

రివ్యూలో నాటౌట్‌గా

దీంతో గేల్ మళ్లీ నాటౌట్‌గా తేలాడు. మిచెల్ స్టార్క్‌ ఐదో ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. మళ్లీ బంతి అతడి ప్యాడ్లకు తాకడం, అదే అంపైర్‌ వేలెత్తడం, గేల్‌ సమీక్ష కోరడం ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే, ఈసారి క్రిస్ గేల్‌కు అదృష్టం కలిసి రాలేదు. రివ్యూలో లెగ్‌ స్టంప్‌ పక్కగా బంతిని తాకుతూ వెళ్లడంతో అంపైర్‌ ఔటిచ్చాడు.

నిరాశగా పెవిలియన్‌కు చేరిన క్రిస్ గేల్

నిరాశగా పెవిలియన్‌కు చేరిన క్రిస్ గేల్

రివ్యూ సమీక్షలో నిర్ణయం ‘అంపైర్‌ కాల్‌'గా రావడంతో గేల్‌ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇదిలా ఉంటే, ఈ ముందు బంతికి స్టార్క్‌ నోబాల్‌ వేశాడు. కానీ అంపైర్‌ గుర్తించలేదు. అదే అంపైర్ ముందు బంతిని నోబాల్‌గా ప్రకటించి ఉంటే, క్రిస్ గేల్ ఫ్రీహిట్‌ ఆడేవాడు. అలాంటిది ఆ బంతికి క్రిస్ గేల్ పెవిలియన్‌కు చేరడం విశేషం.

Story first published: Friday, June 7, 2019, 12:27 [IST]
Other articles published on Jun 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+