న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘రెస్టాఫ్‌ ది వరల్డ్‌’ జట్టుగా ఇంగ్లాండ్: చర్చకు తెరలేపిన సన్నీ వ్యాఖ్యలు

CWC 2019: Sunil Gavaskar jokes about England team, calls it ‘Rest of the World’ side

హైదరాబాద్: గతేడాది పుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించిన సమయంలో ఆ జట్టులోని నల్లజాతి ఆటగాళ్లపై పెద్ద చర్చే జరిగింది. వీరివల్లే ఫ్రాన్స్ రెండోసారి పుట్‌బాల్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిందని అప్పట్లో అందరూ అన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా, ఇప్పుుడ ఇదే చర్చ ఇంగ్లాండ్ ఆటగాళ్లపై మొదలైంది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టులో ఆ దేశ ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుత ఇంగ్లాండ్‌ జట్టు 'రెస్టాఫ్‌ ది వరల్డ్‌' జట్టును తలపిస్తోందని గవాస్కర్ వ్యంగ్యంగా అన్నారు.

ఇండియా టుడే నిర్వహించిన సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యాక్రమంలో పాల్గొన్న గవాస్కర్‌ ఇంగ్లాండ్ జట్టు గురించి ఆ జట్టులో కనీసం ఆరు నుంచి ఏడుగురు ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందినవారేనని, కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ ఐర్లండ్‌ దేశస్థుడైతే.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జోఫ్రా ఆర్చర్‌ వెస్టిండీస్‌ ఆటగాడని సన్నీ తెలిపాడు.

ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ ఇయాన్‌ మోర్గాన్‌ ఐర్లాండ్ దేశస్తుడు కాగా, మొయిన్‌ ఆలీ, ఆదిల్‌ రషీద్‌లు పాక్‌ సంతతికి చెందిన క్రికెటర్లు కాగా బెన్‌స్టోక్స్‌( న్యూజిలాండ్‌), టామ్‌ కరణ్‌(దక్షిణాఫ్రికా), జాసన్‌ రాయ్‌ (దక్షిణాఫ్రికా)లు నాన్‌ ఇంగ్లీష్‌ ఆటగాళ్లు కావడం గమనార్హం. దీనిపై ఇప్పుడు చర్చ మొదలైంది.

ఇయాన్‌ మోర్గాన్‌..

ఇయాన్‌ మోర్గాన్‌..

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్. ఐర్లాండ్‌లోని డుబ్లిన్‌లో జన్మించాడు. తొలుత ఐర్లాండ్‌ జట్టులో 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌ తరపున మోర్గాన్‌ బ్యాటింగ్‌ సగటు 35.42గా ఉంది. ఇంగ్లాండ్‌ లయన్స్‌కు దక్షిణాఫ్రికాకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ కావడంతో ఇంగ్లిష్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2009లో ఐర్లాండ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ తరుపున 200 వన్డేలు ఆడిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

బెన్‌ స్టోక్స్‌

బెన్‌ స్టోక్స్‌

ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. 1991 జూన్‌4న న్యూజిలాండ్‌లోని కాంటర్బరీలో జన్మించాడు. బెన్‌ తండ్రి గెరాల్డ్‌ న్యూజిలాండ్‌ తరపున రగ్బీజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బెన్‌ స్టోక్స్ చిన్నతనంలో ఆయన కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వచ్చింది. తన 19వ ఏట ఇంగ్లాండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

జాసన్‌ రాయ్‌

జాసన్‌ రాయ్‌

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించాడు. జాసన్ రాయ్ చిన్నప్పుడే వారి కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వచ్చింది. తొలుత ఇంగ్లాండ్‌ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న జాసన్ రాయ్ ఆ తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లాండ్‌ తరపున అత్యధిక పరుగులు(180) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

జోఫ్రా ఆర్చర్‌

జోఫ్రా ఆర్చర్‌

బార్బోడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జన్మించాడు. వెస్టిండీస్‌ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కౌంటీ క్రికెట్‌లో సుసెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత బీబీఎల్‌లో హోబార్ట్‌ హరికేన్స్‌ తరుపున మంచి ప్రదర్శన చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Story first published: Monday, June 3, 2019, 16:25 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X