For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

CWC 2019: Sri Lanka vs Australia Live Score: Dimuth Karunaratne elects to field

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ఒక మార్పుతో బరిలోకి దిగారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫిట్‌నెస్ సాధించిన నువాన్ ప్రదీప్ జట్టులోకి రాగా.. సురంగ లక్మల్ స్థానంలో సిరివర్దనకు అవకాశం ఇచ్చినట్లు కరుణరత్నె చెప్పాడు. మరోవైపు గాయంతో ఇబ్బంది పడుతున్న కౌల్టర్ నైల్ స్థానంలో బెహ్న్రెండార్ఫ్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు.

ఈ ప్రపంచకప్‌లో జూన్‌ 4 తర్వాత శ్రీలంక ఆడుతోన్న మ్యాచ్ కావడంతో ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో జరగాల్సిన మ్యాచ్‌లు కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దయ్యాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఈ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

1
43664

దీంతో శ్రీలంక నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పోరులో కరుణరత్నె నాయకత్వంలోని లంకేయులు ఏమేరకు రాణిస్తారో చూడాలి.మరోవైపు ఆస్ట్రేలియా విషయానికి వస్తే నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి సెమీస్‌ దిశగా దూసుకెళుతోంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌కు మరింత దగ్గర కావాలని ఆరోన్ ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. భారత్‌ చేతిలో ఓడినా.. పాక్‌పై అద్భుత విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మళ్లీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

{headtohead_cricket_1_7}

జట్ల వివరాలు:

శ్రీలంక: దిముత్‌ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్‌ పెరీరా, లాహిరు తిరుమన్నె, కుశాల్ మెండిస్‌, ఏంజెలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వా, తిసారా పెరీరా, మిలింద సిరివర్దనే, ఇసురు ఉదాన, లసిత్‌ మలింగ, నువాన్‌ ప్రదీప్‌

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖవాజా, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్‌ కేరీ, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్స్‌సన్‌, జేసన్‌ బెరెండార్ఫ్‌

Story first published: Saturday, June 15, 2019, 15:05 [IST]
Other articles published on Jun 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+