Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్ లేని లోటు రోహిత్ శర్మపై ఒత్తిడిని పెంచుతుంది

 CWC 2019: Shikhar Dhawans absence will put more pressure on Rohit Sharma, says Harbhajan Singh

హైదరాబాద్: జట్టులో శిఖర్ ధావన్ లేకపోవడం ఓపెనర్ రోహిత్ శర్మపై ఒత్తిడిని పెంచుతుందని టీమిండియా వెటనర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు వారాల పాటు ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

స్థానంలో రోహిత్ శ‌ర్మ‌తో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బ‌రిలో దిగ‌నున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్‌ చేయించింది. దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

మూడు వారాల పాటు టోర్నీకి ధావన్ దూరం

మూడు వారాల పాటు టోర్నీకి ధావన్ దూరం

దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్‌ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిని ఎంపిక చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డాడు.

భజ్జీ మాట్లాడుతూ

భజ్జీ మాట్లాడుతూ

భజ్జీ మాట్లాడుతూ "నాకు తెలియదు, రోహిత్ శర్మ ఎంత బాధపడుతున్నాడో.. తుది జట్టులో ధావన్ లేకపోవడం ఓపెనర్ రోహిత్ శర్మపై ఒత్తిడిని పెంచుతుంది. కేఎల్ రాహుల్‌తో అతడి భాగస్వామ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ధావన్‌ వంటి కీలక ఆటగాడు జట్టుకు దూరం కావడం భారత్‌కు కచ్చితంగా ప్రతికూల పరిస్థితే" అని అన్నాడు.

సగం టోర్నమెంట్‌ పూర్తి అవుతుంది

సగం టోర్నమెంట్‌ పూర్తి అవుతుంది

"అందులోనూ మూడు వారాలు అంటే దాదాపు సగం టోర్నమెంట్‌ పూర్తి అవుతుంది. ప్రత్యామ్నాయంగా కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో ఉన్నా అతను ఇటీవల ఓపెనింగ్‌కు దిగిన సందర్భాలు లేవని.. ధావన్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎంపిక చేయడం జట్టు మేనేజ్‌మెంట్‌కు సవాల్‌తో కూడుకున్న పని" అని హర్భజన్‌ తెలిపాడు.

రిషబ్‌ పంత్‌ లేదా అజ్యింకె రహానే

రిషబ్‌ పంత్‌ లేదా అజ్యింకె రహానే

ప్రస్తుతం ధావన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల విషయానికి వస్తే రిషబ్‌ పంత్‌ లేదా అజ్యింకె రహానే ముందు వరుసలో ఉంటారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై రహానేకు మెరుగైన రికార్డు ఉంది. గత వరల్డ్‌కప్‌లోనూ రహానే మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని భజ్జీ తెలిపాడు.

ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై ప్రభావం

ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై ప్రభావం

రిషబ్‌ పంత్‌కు మాత్రం తాను తొలి ప్రాధాన్యతనిస్తానని, అయితే, అనుభవం విషయానికొస్తే మాత్రం రహానేను ఎంపిక చేస్తానని భజ్జీ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్‌లతో తలపడనుంది. ఆ మ్యాచ్‌తో ఓపెనింగ్, నాలుగో స్థానంపై కూడా స్పష్టత రానుంది. ధావన్ లేని లోటు భారత్ విజయావకాశాలపై పడనుంది.

Story first published: Wednesday, June 12, 2019, 12:50 [IST]
Other articles published on Jun 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+