Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆప్ఘన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

CWC 2019, SA vs AFG LIVE score: South Africa decide to bowl first

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. వన్డే క్రికెట్‌లో తొలిసారి దక్షిణాఫ్రికాతో ఆప్ఘనిస్థాన్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగనుండటంతో ఏదో ఒక జట్టు గెలిచే అవకాశం ఉంది. సఫారీలు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ ఓడిపోయారు. వరుసగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా విండీస్‌తో వర్షం వల్ల ఆడలేకపోయింది.

1
43663

దీంతో కేవలం ఒకే పాయింట్‌తో దక్షిణాఫ్రికా కింది నుంచి రెండో స్థానంలో ఉంది. సెమీస్‌ రేస్‌లో నిలవాలంటే దక్షిణాఫ్రికా మిగతా ఐదు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు పసికూన అప్ఘనిస్తాన్‌ కూడా వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నీలో బోణీ చేయాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), హషీమ్ అమ్లా, డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఆండిల్ ఫెహ్లక్వేవో, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్

ఆఫ్ఘనిస్తాన్: గుల్బాదీన్ నాయిబ్ (కెప్టెన్), నూరు అలీ జద్రన్, హజ్రుతల్లా జజాయ్, రహ్మాత్ షా (వికెట్ కీపర్), అస్ఘర్ ఆఫ్ఘన్, హష్మతుల్లా షహీది, నజీబుల్లా జద్రన్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, దౌలాత్ జద్రన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హసన్

Story first published: Saturday, June 15, 2019, 18:34 [IST]
Other articles published on Jun 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+