
హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. నిజానికి, ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15మంది జాబితాలో రవీంద్ర జడేజా సభ్యుడిగా ఉన్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయినా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మ్యాచ్ ఆడే అవకాశం రవీంద్ర జడేజాకు లభించలేదు. ఇంగ్లడ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్ధానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చి అద్భుతమైన క్యాచ్‌ని పట్టాడు. అయితే, ఇప్పటికే టీమిండియా సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు శ్రీలంకతో జరిగే మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్ కావడంతో రెండు మార్పులు చేసింది.
మార్పుల్లో భాగంగా జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చినట్లు టాస్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరణరత్నే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌కి ముందు భజ్జీ మాట్లాడుతూ శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో ఆల్ రౌండర్ జడేజాకు చోటు కల్పిస్తే బాగుంటుందని హర్భజన్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మిడిల్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ వేయడంతో పాటు, డెత్ ఓవర్లలో బ్యాట్‌తోనూ పరుగులు సాధించే అవకాశం ఉందని భజ్జీ అన్నాడు.
కాగా భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు ఆడాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్.. 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ 'టై' అయింది. ఇక 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్.. 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది.