న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోహైల్‌, అజామ్‌ హాఫ్ సెంచరీలు.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

Pakistan

ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 309 పరుగులు లక్ష్యంను ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (44; 57 బంతుల్లో 6 ఫోర్లు), ఫకార్‌ జమాన్‌ (44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) లు మంచి భాగస్వామ్యం అందించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అదిరే ఆరంభం:

అదిరే ఆరంభం:

ఈ జోడి ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ.. సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడి పెవిలియన్ చేరాడు. తాహిర్‌ బౌలింగ్‌లో జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా.. బంతి వికెట్‌ కీపర్‌ వెనకాలే గాల్లోకి లేచింది. ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హషీమ్‌ ఆమ్లా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 81 పరుగుల బాగస్వామ్యంకు తెరపడింది.

తాహీర్‌ మాయ:

తాహీర్‌ మాయ:

ఈ సమయంలో ఇమాముల్‌ హక్‌కు బాబర్‌ అజామ్‌ జత కలిశాడు. అయితే 21వ ఓవర్‌ రెండో బంతిని ఇమామ్‌ డ్రైవ్‌ చేయగా.. బంతి తాహిర్‌కు పక్కగా వెళ్తుండగా ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 98 పరగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. హక్‌-ఫకార్‌ జమాన్‌లు ఇద్దరు 44 పరుగుల వ్యక్తిగత పరుగులు సాధించిన తర్వాత పెవిలియన్‌ చేరడం గమనార్హం. వీరిద్దరూ ఇమ్రాన్‌ తాహీర్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడం మరో విశేషం.

హాఫ్ సెంచరీలు:

హాఫ్ సెంచరీలు:

ఓపెనర్లిద్దరూ వెనుదిరగడంతో బాబర్‌ అజామ్‌, హఫీజ్‌ (20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ మార్‌క్రమ్‌.. హఫీజ్‌ను ఔట్ చేసాడు. దీంతో పాక్ మూడో వికెట్‌ చేజార్చుకుంది. బాబర్‌ (69; 80బంతుల్లో 7×4)కు సోహైల్‌ జతకలవడంతో పాక్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. పేసర్ మోరిస్‌ వేసిన 36 ఓవర్ మొదటి బంతికి సింగిల్‌ తీసి బాబర్‌ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అజామ్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం బాబర్‌ ఔట్ అయినా.. సోహైల్‌ (89; 59బంతుల్లో 9×4, 3×6) బ్యాట్ జులిపించాడు. చివరలో ఇమాద్ వసీం (23) పరుగులు చేయడంతో పాక్ 300 మార్క్ స్కోర్ దాటింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహిర్ 2, పెహ్‌లుక్‌వాయో, మార్క్రంలు చెరొక వికెట్ తీశారు.

1
43673
Story first published: Sunday, June 23, 2019, 19:56 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X