వరల్డ్‌కప్: ఇంగ్లాండ్ పిచ్‌లపై భయం లేదు

హైదరాబాద్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లోని ఫ్లాట్ ట్రాక్స్ చూసి తానేమీ భయపడటం లేదని చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన భారత స్పిన్నర్ల గురించి తక్కువ అంచనా వేయొద్దని చాహల్ తెలిపాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఫ్లాట్ పిచ్‌లపై తరచూ మ్యాచ్‌లు
గత కొంతకాలంగా తాము ఫ్లాట్ పిచ్‌లపై తరచూ మ్యాచ్‌లు ఆడటంతో ఇది పెద్ద ప్రభావం చూపదని చాహల్ అన్నాడు. భారత్‌లో చిన్నస్వామి స్టేడియం అత్యుత్తమ బ్యాటింగ్ ట్రాక్ అని, అక్కడ తాను చాలా మ్యాచ్‌లు ఆడి ఉండటంతో ఫ్లాట్ ట్రాక్స్ అంశం పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలిపాడు.

కుల్దీప్ యాదవ్‌తో పాటు నా బౌలింగ్‌లో
"గత ఆరు నెలలుగా కుల్దీప్ యాదవ్‌తో పాటు నా బౌలింగ్‌లో మార్పేమీ లేదు. జట్టు అవసరాలని బట్టి బంతులు వేస్తాం. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా ఉన్నాయి. దీని గురించి మేం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పిచ్‌లపై ఆడిన అనుభవం మాకుంది" అని అన్నాడు.

ఎక్కువ మ్యాచ్‌లు
"బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి మైదానంలో ఏటా నేను ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నా. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఓడినంత మాత్రాన ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ పిచ్‌లపై నేను ఒత్తిడికి పడితే ప్రత్యర్థి బౌలర్ సైతం ఒత్తిడికి గురవుతాడు" అని చాహల్ అన్నాడు.

ప్రతి బంతిని అత్యుత్తమంగా వేసేందుకే ప్రయత్నిస్తా
"రసెల్, వార్నర్ లాంటి ఆటగాళ్లు పరుగులు చేయకుండా అడ్డుకోలేం. వారిపై దాడి చేయాలి. అందుకే ప్రతి బంతిని అత్యుత్తమంగా వేసేందుకే ప్రయత్నిస్తాను. తప్పుల్ని సరిదిద్దుకుని ప్రపంచకప్‌లో సత్తా చాటడమే మా లక్ష్యం. మనం ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవలేం. ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్‌లా ఆడింది" అని చాహల్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications