గేమ్ ఛేంజర్ అతడే: కోహ్లీ, మిగతా ఆటగాళ్లకు గ్రౌండ్‌లో ధోనినే కెప్టెన్

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని పేపర్‌పై భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ కాకపొవచ్చు... అయితే మైదానంలో మాత్రం కోహ్లీతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లకు ధోనినే కెప్టెన్ అని సురేశ్ రైనా తెలిపాడు. 2011, 2015 వరల్డ్‌కప్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని 2017లో తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ తర్వాత ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ జట్టుని సమర్ధవంతంగా నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ కెప్టెన్‌గా కోహ్లీకి తొలి వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ మాజీ కెప్టెన్ మైదానంలో అసలు కెప్టెన్ కోహ్లీకి కీలక సూచనలు చేస్తాడని రైనా చెప్పుకొచ్చాడు.

ధోని కెప్టెన్ కాకపోవచ్చు
వరల్డ్‌కప్ నేపథ్యంలో సురేశ్ రైనా మాట్లాడుతూ "పేపర్‌పై ధోని కెప్టెన్ కాకపోవచ్చు. కానీ, మైదానంలో కోహ్లీసేనకు ధోనినే కెప్టెన్" అని సురేశ్ రైనా పీటీఐకి ఇచ్చిని ఇంటర్యూలో తెలిపాడు. ప్రస్తుతం సురేశ్ రైనా తన కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆత్మవిశ్వాసంతో కోహ్లీ
"ధోని రోల్ ఇప్పటికీ అదే. స్టంప్స్ వెనుక నుంచి బౌలర్లతో మాట్లాడి ఫీల్డింగ్‌ను సెట్ చేస్తాడు. కెప్టెన్లకే కెప్టెన్. స్టంప్స్ వెనుక ధోని ఉంటే విరాట్ కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆ విషయం కోహ్లీకి తెలుసు" అని రైనా తెలిపాడు. ఐపీఎల్‌లో 10 సీజన్ల పాటు ధోని నాయకత్వంలో రైనా ఆడిన సంగతి తెలిసిందే.

హార్ధిక్ పాండ్యా కీలకం
ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో పాండ్యా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని రైనా తెలిపాడు. పాండ్యా గురించి రైనా మాట్లాడుతూ "ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయగలడు. దీంతో పాటు 6-7 ఓవర్లు వేయగలడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతడు స్వేచ్చగా ఆడేందుకు జట్టు మేనేజ్‌మెంట్ పూర్తి స్వేచ్ఛ నివ్వాలి. ఐపీఎల్ ఆత్మవిశ్వాసాన్ని వరల్డ్‌కప్‌లో ప్రదర్శిస్తే అతడే గేమ్ ఛేంజర్ కాగలడు" అని రైనా అన్నాడు.

కోహ్లీకి ఇది అతిపెద్ద వరల్డ్‌కప్
విరాట్ కోహ్లీకి ఇది అతిపెద్ద వరల్డ్‌కప్ అని రైనా అన్నాడు. "కెప్టెన్, టీమ్ ప్లేయర్‌గా కోహ్లీ అద్భుతం. అతడికి ఇది అతిపెద్ద వరల్డ్‌కప్. ఈ మెగా టోర్నీలో అతడి పాత్ర ఏంటో తెలుసు. జట్టులోని సహచర ఆటగాళ్లకు ఆతడు ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. టోర్నీలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదే అత్యుత్తమ జట్టు" అని రైనా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications