ఒక మ్యాచ్‌లో రెండు ప్రపంచ రికార్డులు: చరిత్ర సృష్టించిన ధోని

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా, బౌలింగ్‌లో బుమ్రా(2/35), చాహల్(4/51) మెరుపులు మెరిపించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఈ మ్యాచ్‌లో ధోని కూడా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా 600 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన తొలి వికెట్ కీపర్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ధోని తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్ బౌచర్(596), శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర(499), ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్(485) ఈ జాబితాలో ఉన్నారు.

అత్యధిక అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్లు వీరే:
మహేంద్ర సింగ్ ధోని - 600*
మార్క్ బౌచర్ - 596
కుమార సంగక్కర - 499
ఆడమ్ గిల్ క్రిస్ట్ - 485

స్టంపింగ్స్‌తో ధోని మరో రికార్డు
దీంతో పాటు ఈ మ్యాచ్‌లో స్టంపింగ్స్‌తోనూ ధోని మరో రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫెలుక్వాయోను చాహల్ బౌలింగ్‌లో స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు. ఈ స్టంపౌట్‌తో అత్యధికంగా 139 స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ రికార్డుని ధోని సమం చేశాడు.

వికెట్ కీపర్ల జాబితాలో
ఇక, వరల్డ్‌కప్‌లో అత్యధికంగా బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపిన వికెట్ కీపర్ల జాబితాలో ధోని మూడు స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో 54 వికెట్లతో కుమార సంగర్కర మొదటి స్థానంలో ఉండగా 52 వికెట్లతో గిల్ క్రిస్ట్ రెండో స్థానంలో, 32 వికెట్లతో మెక్‌కల్లమ్ నాలుగోస్థానంలో, 31 వికెట్లతో బౌచర్ ఐదో స్థానంలో ఉన్నారు.

వరల్డ్‌కప్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్లు:
54 - కుమార సంగక్కర
52 - ఆడమ్ గిల్ క్రిస్ట్
33 - ధోని*
32 - బ్రెండన్ మెక్‌కల్లమ్
31 - మార్క్ బౌచర్

34 పరుగులు చేసిన ధోని
కాగా, సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో ధోని 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం చేధనలో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 122 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications