ఆ ఆడియో క్లిప్‌లో ఏముంది?: జట్టులో రెండు గ్రూపులు: సర్ఫరాజ్ కెప్టెన్సీకి ఎసరు!

హైదరాబాద్: జట్టులో విబేధాలు... కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ మాటల్ని ఎవరు ఖాతారు చేయకపోవడం.. గ్రూపు రాజకీయాల వల్లే భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి పాకిస్థాన్ మీడియా వర్గాలు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ఓటమి అనంతరం పాకిస్థాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు కనీసం పోరాడకుండా ఓడిపోవడాన్ని అక్కడి మీడియా సైతం జీర్ణించుకోలేకపోతుంది. పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంల నేతృత్వంలో ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి.. కెప్టెన్ మాటలను ఖాతరు చేయడం లేదని వార్తలను ప్రచురించాయి.

గ్రూప్ రాజకీయాల్లో పాక్ చీఫ్ సెలక్టర్ కూడా
అయితే, ఈ గ్రూప్ రాజకీయాల్లో పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ హస్తం కూడా ఉందని అందులో రాసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇమామ్ ఉల్ హక్, ఇమాద్ వసీం, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఏమాత్రం లెక్కచేయడం లేదని పేర్కొన్నాయి. ఈ కారమంగానే సర్ఫరాజ్ మైదానంలో వ్యూహాలు రచించలేకపోయాడని, ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలతో అతను ప్రశాంతత కోల్పోయాడని రాశాయి.

భారత్ చేతిలో ఓటమి అనంతరం
భారత్ చేతిలో ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో సర్ఫరాజ్ ఆటగాళ్లను మందలించాడనే వార్తలు సైతం వచ్చాయి. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే? తనతో పాటు స్వదేశంలో ఒంటరిగా ఎవరూ అడుగు పెట్టలేరని సర్ఫరాజ్ హెచ్చరించినట్లు ఆ వార్త కథనాల్లో తెలిపాయి. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ప్రచురించింది.
బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని
ఇంటికి వెళ్లేటప్పుడు గానీ, బయట తిరిగేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్ సూచించినట్లు పేర్కొంది. తాజాగా ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీసీబీ మాజీ అధికారి, నటుడు రాజు జమిలి మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియోక్లిప్ ఉండటం విశేషం. ఆ ఆడియోలో పాక్ జట్టులో ఇమామ్, ఇమాద్, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఖాతరు చేయడం లేదని, ఆటగాళ్లు మహ్మద్ ఆమిర్, ఇమాద్ గ్రూప్‌లుగా విడిపోయారని... ఇందులో చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ పాత్ర కూడా ఉందని అన్నారు. సర్ఫరాజ్‌ను జట్టు నుంచి దూరం చేయడానికి కొంత మంది ఆటగాళ్లు కుట్రపన్నుతున్నారని అందులో పేర్కొన్నాడు.

ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా
ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా తనను షోయబ్ మాలిక్ కలిశాడని, సర్ఫరాజ్ ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడని రాజు జమిలి అన్నట్లు అందులో ఉంది. అయితే, రాజు జమిలి ఆరోపణలపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడిన పాక్ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. టోర్నీలో భాగంగా జూన్ 23న తన తదుపరి మ్యాచ్‌లో లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications