150 వికెట్లు: వరల్డ్‌కప్‌లో మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 289 పరుగుల లక్ష్య చేధనకు దిగిన వెస్టిండిస్‌ను 273/9 కట్టడి చేయడంలో మిచెల్ స్టార్క్ కీలకపాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ (5/46) ఐదు వికెట్ల గణాంకాలు మ్యాచ్‌కే హైలెట్. వన్డేల్లో ఐదు వికెట్లను పడగొట్టడం మిచెల్ స్టార్క్ ఆరోసారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన స్టార్క్ 5 వికెట్లు తీసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో స్టార్క్ పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైయిన్ ముస్తాక్ రికార్డుని అధిగమించాడు.

సక్లైయిన్ ముస్తాక్ రికార్డు బద్దలు
ఇప్పటివరకు వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రికార్డు సక్లైయిన్ ముస్తాక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీయడం ద్వారా అతడి రికార్డుని బద్దలు కొట్టాడు. సక్లైయిన్ ముస్తాక్ ఈ రికార్డుని 78 మ్యాచ్‌ల్లో సాధించగా స్టార్క్ 77 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.

క్రిస్ గేల్‌ను ఎల్బీగా ఔట్ చేసిన స్టార్క్
ఈ మ్యాచ్‌లో తొలుత పవర్ ప్లేలో విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను స్టార్క్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్(15), జాసన్ హోల్డర్(51), కార్లోస్ బ్రాత్ వైట్(16), షెల్డన్ కాట్రెల్(1)లను ఔట్ చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

విండిస్‌పై స్టార్క్ మెరుగైన రికార్డు
ఇక, వెస్టిండిస్ జట్టుపై స్టార్క్ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు. విండిస్‌తో మొత్తం 7 మ్యాచ్‌లాడిన స్టార్క్ 12,76 యావరేజితో 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 288 పరుగులకు కుప్పకూలింది.

15 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
ఆసీస్ జట్టులో కౌల్టర్-నైల్(92; 60 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (103 బంతుల్లో 73; 7 ఫోర్లు), అలెక్స్ క్యారీ (55 బంతుల్లో 45; 7 ఫోర్లు) రాణించారు. విండిస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్ (3/67) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో షై హోప్ (105 బంతుల్లో 68; 7 ఫోర్లు), నికొలస్ పూరన్ (36 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హోల్డర్ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) రాణించినా విండిస్ 9 వికెట్లకు 273 పరుగులే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications