దక్షిణాఫ్రికాపై సెంచరీ: రోహిత్ శర్మ బద్దలు కొట్టిన రికార్డులివే!

హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఆడిన ఏ సిరిస్‌లోనూ పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ 12వ సీజన్‌లో సైతం రోహిత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌లో ఏమాత్రం రాణిస్తాడో అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, బుధవారం సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం చేధనలో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 122 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...

రెండు సెంచరీలు
2 - వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీలు
3 - ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మకు ఇది మూడో వన్డే. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్‌ల సరసన నిలిచాడు. వీరిద్దరూ కూడా ఇంగ్లీషు పిచ్‌లపై మూడు సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 4 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

చేధనలో ఇప్పటివరకు చేసిన సెంచరీలు
8 - చేధనలో రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన సెంచరీలు. క్రికెట్ లెజెండ్ సచిన్‌తో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
23 - వన్డేల్లో రోహిత్ సాధించిన సెంచరీలు. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లో మూడో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (22) రికార్డుని బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లీ (41) సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు
122 నాటౌట్ - వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో చేధనలో ఓ భారత బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1996 వరల్డ్‌కప్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన 127 పరుగులే ఇప్పటివరకు చేజింగ్‌లో ఓ భారత బ్యాట్స్‌మెన్ నమోదు చేసిన అత్యధిక పరుగులు. ఈ రికార్డుని ఇంత వరకూ ఎవరూ బద్దలు కొట్టలేదు.
128 - సెంచరీ సాధించడానికి ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన బంతులు. వన్డేల్లో అతడికిదే అత్యంత నెమ్మదైన సెంచరీ.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత
201 - వన్డేల్లో రోహిత్ శర్మ 23 సెంచరీలు సాధించేందుకు తీసుకున్న ఇన్నింగ్స్‌లు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్. ఈ జాబితాలో హషీం ఆమ్లా(132 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ(157), ఏబీ డివిలియర్స్(187) పరుగులతో ఉన్నారు.
354 - అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు బాదిన సిక్సులు. అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(352) సిక్సులు రికార్డుని బద్దలు కొట్టి ధోని(354)తో సమం అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications