చాహల్ మాయ: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలపై అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
క్రీజులో డేవిడ్ మిల్లర్(23), ఫెలుక్వాయో(13) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లోనే మరో ఓపెనర్ డికాక్(10) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యారు. ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న సౌతాఫ్రికా కొద్దిసేపు నిలకడగా ఆడింది.
డుప్లెసిస్, డుస్సెన్ భారీ షాట్లకు ప్రయత్నించకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో చాహల్ వీరిద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. చాహల్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని డుస్సెన్(22) రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి బౌల్డయ్యాడు.
ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి డుప్లెసిస్(38)ను చాహాల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జేపీ డుమినీని(3) కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన డుమినీ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications