Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పీడ్ పెంచిన బుమ్రా: 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

ICC Cricket World Cup 2019 : Bumrah,Kuldeep,Chahal Leave South Africa Five Down
 CWC 2019: India vs South Africa Live Score: Bumrah Removes Openers Early

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు. తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో 24 పరుగులకే సఫారీలు 2 వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు.

తన కెరీర్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న బుమ్రాకు తన తొలి మ్యాచ్‌లోనే ఆరంభంలోనే వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లోనే మరో ఓపెనర్ డికాక్(10) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యారు.

1
43651

ఆరంభంలోనే వికెట్లను కోల్పోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం 8 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. డుప్లెసిస్(11), వాన్ డర్ డస్సెన్(3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ను తీసుకుంది. టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలతో బరిలోకి దిగుతోంది. షమీ, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకోలేదు.

{headtohead_cricket_3_6}

Story first published: Wednesday, June 5, 2019, 16:04 [IST]
Other articles published on Jun 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+