Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-కివీస్ మ్యాచ్‌‌ వర్షార్పణమేనా?: మాంచెస్టర్‌‌లో తాజా అప్‌డేట్ ఇదే!

CWC 2019, India vs New Zealand: 1st semi-final, Reserve Day weather forecast- Hourly temperature and chances of rain

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మంగళవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మొదలైన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉన్న సమయంలో వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గపోవడంతో మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. రిజర్వు డే అయిన బుధవారం తిరిగి మొదటి నుంచి ఆటను ప్రారంభించరు. ఎక్కడ నుంచి ఆగిందో అక్కడ నుంచే బుధవారం మ్యాచ్‌ని కొనసాగిస్తారు. రిజర్వే డే రోజున కూడా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించిన విజేతను నిర్ణయిస్తారు.

యుకే కాలమానం ప్రకారం

లండన్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు ఆరంభం అవుతుంది. మ్యాచ్‌కు వేదిక‌గా మారిన మాంచెస్ట‌ర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కూ వ‌ర్షం కురిసింది. ప్ర‌స్తుతం అక్క‌డ అడ‌పాద‌డ‌పా తేలిక‌పాటి జ‌ల్లులు త‌ప్ప భారీ వ‌ర్షమేదీ న‌మోదు కాలేదు. అయితే, బుధవారం కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది.

ఆకాశం మేఘావృతమై ఉంటుంది

ఉద‌యం ఆకాశం మేఘావృతమై ఉంటుంద‌ని, మ‌ధ్యాహ్నం త‌రువాత ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డే అవ‌కాశ ఉంద‌ని మాంచెస్ట‌ర్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30గంటలు) వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి.

గంట సేపటికి వర్షం ప్రభావం తగ్గినా

ఆ తర్వాత గంట సేపటికి వర్షం ప్రభావం తగ్గినా.. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండవచ్చని మాంచెస్ట‌ర్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు త‌మ అధికారిక ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. మళ్లీ సాయంత్రం 5గంటలకు(ఇక్కడ రాత్రి 9:30గంటలు) చినుకులు పలకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంటే మ్యాచ్‌ ముగింపు దశకు వచ్చే సమయానికి మళ్లీ వర్షం పడుతుందంట.

వర్షం తగ్గితే ఓవ‌ర్ల‌ను కుదించ‌డానికే

ఇదే గనుక జరిగితే ఓవ‌ర్ల‌ను కుదించ‌డానికే అంపైర్లు మొగ్గు చూపుతారు. ఓవ‌ర్ల‌ను కుదించిన త‌రువాత టీమిండియా ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలో దిగాల్సి వ‌స్తే.. అంత చ‌లిలోనూ చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం. ఓవ‌ర్లు కుదించిన త‌రువాత మ్యాచ్‌ను కొన‌సాగించాల్సి వ‌స్తే.. టీమిండియా క‌ఠిన ప‌రిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Story first published: Wednesday, July 10, 2019, 13:12 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+