Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తడబడ్డ టీమిండియా: ఆప్ఘనిస్థాన్ విజయ లక్ష్యం 225

ICC Cricket World Cup 2019:Afghanistan Control Virat Kohli And Co to 224/8 || Oneindia Telugu
Kohli

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ రెచ్చిపోవడం ఖాయమని సగటు క్రీడాభిమాని ఈ మ్యాచ్‌కు ఊహించుకున్నాడు. అయితే మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆప్ఘన్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 67(5 ఫోర్లు), కేదార్ జాదవ్ 68 బంతుల్లో 52(3 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్థాన్‌కు 225 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్ఘన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్, నబీ చెరో రెండు వికెట్లు తీయగా... జద్రాన్, ఆలం, రషీద్ ఖాన్, రహ్మత్ షా తలో వికెట్ తీశారు.

1
43671

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ(1) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

కోహ్లీ హాఫ్ సెంచరీ

ఈ క్రమంలో కోహ్లీ-విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది ప్రయత్నం చేసింది. వీరిద్దరూ 58 పరుగుల జత చేసిన తర్వాత విజయ్‌ శంకర్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దీంతో జట్టు స్కోరు 122 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం జట్టు స్కోరు 135 వద్ద కోహ్లీ అనూహ్యంగా ఔటయ్యాడు.

నిరాశపరిచిన ధోని, పాండ్యా

మహ్మద్ నబీ వేసిన బంతిని కట్ షాట్ చేయబోగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ రహ్మత్ షా చేతిలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని, కేదార్ జాదవ్‌లు ఆప్ఘన్ బౌలర్లను ప్రతిఘటించడంతో భారత్‌ తేరుకుంది. వీరిద్దరూ 57 పరుగులు జత చేసిన తర్వాత ధోని ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హార్దిక్‌ పాండ్యా(7) కూడా పెవిలియన్‌ చేరాడు.

పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరించడంతో

అనంతరం షమీ(1) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కేదార్‌ జాదవ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్‌ ఐదో బంతికి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరించడంతో పరుగులు చేయడానికి భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Story first published: Saturday, June 22, 2019, 19:11 [IST]
Other articles published on Jun 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+