For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గాన్‌తో మ్యాచ్.. ప్రపంచకప్‌లో భారత్‌కు 50వ విజయం

Kohli

ప్రపంచకప్‌-2019లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరగగా.. నాలుగు విజయాలు సాధించింది. ఇక న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. శనివారం అఫ్గాన్‌పై తాజా విజయంతో భారత్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో 50 విజయాలను అందుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ టోర్నీల్లో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌ కంటే ముందు ఆస్ట్రేలియా (67), న్యూజిలాండ్‌ (52)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచకప్‌లో భారత్‌ మరో అరుదైన రికార్డు సృష్టించింది. లీగ్‌ స్టేజీల్లో అత్యధిక వరుస విజయాలు (11) నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది.

చివరిసారి 2011 ప్రపంచకప్‌లో నాగ్‌పూర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. భారత్‌కన్నా ముందు ఆస్ట్రేలియా 13 లీగ్‌ మ్యాచ్‌లు వరుసగా గెలిచింది. 1999 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా ఈ ఘనత అందుకుంది. భారత్‌ మరో రికార్డు కూడా నెలకొల్పింది. అఫ్గాన్‌పై 11 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.

ప్రపంచకప్‌లో అత్యల్ప తేడాతో భారత్‌ సాధించిన విజయం ఇదే. అంతకుముందు 1987 ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలుపొందింది. సౌతాంప్టన్‌ వేదికగా శనివారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (67), కేదార్‌ జాదవ్‌ (52)లు హాఫ్‌ సెంచరీలు చేశారు. కేఎల్‌ రాహుల్‌ (30), విజయ్‌ శంకర్‌ (29), ధోనీ (28)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ 213 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ (52) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Story first published: Sunday, June 23, 2019, 22:01 [IST]
Other articles published on Jun 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+