భలేగా ఉందే!: డేవిడ్ వార్నర్‌కు కొత్త నిక్‌నేమ్ పెట్టిన సహచర ఆటగాళ్లు

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆట పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 89.40 యావరేజితో 447 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీతో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (166 పరుగులు) నమోదు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నరే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వార్నర్ మాట్లాడుతూ తన సహచర ఆటగాళ్లు కొత్త నిక్ నేమ్ పెట్టారని తెలిపాడు.

నాకు కొత్త పేరు పెట్టారు
"ప్రపంచకప్‌లో నా ప్రదర్శనతో జట్టులోని సహచర ఆటగాళ్లు నాకు కొత్త పేరు పెట్టారు. కెరీర్ మొదట్లో నన్ను బుల్ అని పిలిచేవారు. ఆ తర్వాత రెవరెండ్ అంటూ కాస్త మర్యాద ఇచ్చారు. ప్రస్తుతం ‘హమ్ బుల్'(హంబుల్)అంటూ సరికొత్త నిక్ నేమ్ పెట్టారు. వాళ్లు ప్రేమతో ఎలా పిలిచినా సంతోషమే" అని వార్నర్ తెలిపాడు.

నా ప్రదర్శన ఇలాగే కొనసాగించాలని
"బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సహకరించినా సహకరించకపోయినా చివరి వరకు క్రీజులో పాతుకపోవాలని భావించాను. ఈ ప్రపంచకప్ తదుపరి మ్యాచ్‌ల్లో సైతం నా ప్రదర్శన ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాను" అని డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆసీస్ తరుపున 16 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్‌క్రిస్ట్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ముడో స్థానంలో డేవిడ్ వార్నర్
ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో రికీ పాంటింగ్(29), మార్క్ వా(19)లు ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో వార్నర్ ఇప్పటివరకు చేసిన పరుగులు 89*, 3, 56, 107, 26, 166. విండీస్‌తో మ్యాచ్‌లో మినహా మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘన్‌తో పోరులో తొలి వికెట్‌కు ఆరోన్ ఫించ్‌తో కలిసి 96 పరుగులు జోడించిన వార్నర్, భారత్‌పై 61 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.

తొలి వికెట్‌కు 146 పరుగులు
ఇక, పాకిస్థాన్‌పై సెంచరీ (107) నమోదు చేయడంతో పాటు తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. శ్రీలంకపై 26 పరుగులే చేసినా.. తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు కెప్టెన్‌తో కలిసి 121 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications