Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ థ్రిల్లర్: 15 పరుగులు రాబట్టిన ఇంగ్లాండ్

England

హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ డ్రా అయింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్ షాట్‌కు యత్నించాడు. రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. కానీ రెండో పరుగు తీసే సమయానికి మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు.

మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బౌల్‌​ వేసిన ఓవర్‌లో 15 పరుగులు సాధించింది. స్టోక్స్‌, బట్లర్‌లు బౌల్ట్‌ బౌలింగ్‌ల్‌ ఎదురుదాడికి దిగారు. దీంతో అవలీలగా 15 పరుగులు రాబట్టారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

అంతకముందు హెన్రీ నికోల్స్ 77 బంతుల్లో 55(4 ఫోర్లు), టామ్ లాథమ్ 56 బంతుల్లో 47(2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.

{headtohead_cricket_2_4}

Story first published: Monday, July 15, 2019, 0:00 [IST]
Other articles published on Jul 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+