For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన ఆర్చర్, వుడ్: ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 213

CWC 2019: England vs West Indies Live Score: Archer, Wood star as Windies crumble for 212

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు పోటీలు పడి వికెట్లు తీశారు. విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికోలస్ పూరన్ 78 బంతుల్లో 63(3 ఫోర్లు, సిక్స్), హెట్ మెయిర్ 48 బంతుల్లో 39(4 ఫోర్లు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 44.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జో రూట్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్, ప్లంకెట్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో షానన్ గాబ్రియేల్‌ను ఔట్ చేయడం ద్వారా మార్క్ వుడ్ వన్డేల్లో 50 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వెస్టిండిస్‌ ఆరంభంలోనే ఎవిన్‌ లూయిస్‌(2) వికెట్‌ను కోల్పోయింది. క్రిస్‌ వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి లూయిస్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్‌ హోప్‌‌తో కలిసి క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు.

అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా క్రిస్ గేల్‌(36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫ్లంకెట్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని భారీ షాట్‌కు యత్నించి బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన రెండో బంతికి తడబడుతున్న షాయ్ హోప్(11) ఎల్బీగా వెనుదిరిగాడు.

1
43662

దీంతో 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత నికోలస్ పూరన్(63), హెట్ మెయిర్(39) రాణించినప్పటికీ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్(9), ఆండ్రీ రస్సెల్(21), కార్లోస్ బ్రాత్ వైట్(14) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో విండిస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది.

{headtohead_cricket_2_8}

Story first published: Friday, June 14, 2019, 18:45 [IST]
Other articles published on Jun 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+