Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జో రూట్ సెంచరీ: వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ అలవోక విజయం

Joe Root

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. విండిస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది మూడో విజయం కాగా, వెస్టిండిస్‌కు రెండో ఓటమి. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో జో రూట్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు.

చేధనలో ఓపెనర్లు బెయిర్‌స్టో-జో రూట్‌లు ఇన్నింగ్స్‌‌ను దూకుడుగా ఆరంభించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీల వైపు దూసుకెళ్తున్న సమయంలో జట్టు స్కోరు 95 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో(45) రూపంలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. గాబ్రియేల్ వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో పెవిలియన్ చేరాడు.

1
43662

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో విజయానికి మరో 14 పరుగులు అవసరమైన తరుణంలో క్రిస్ వోక్స్(40) పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి ఫ్యాబియన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

మరోవైపు జోరూట్ 93 బంతుల్లో 11 ఫోర్లతో వన్డేల్లో 16 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌ రెండు వికెట్లు తీశాడు.


ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 213
అంతకముందు విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికోలస్ పూరన్ 78 బంతుల్లో 63(3 ఫోర్లు, సిక్స్), హెట్ మెయిర్ 48 బంతుల్లో 39(4 ఫోర్లు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 44.4 ఓవర్లలో 212 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జో రూట్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్, ప్లంకెట్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో షానన్ గాబ్రియేల్‌ను ఔట్ చేయడం ద్వారా మార్క్ వుడ్ వన్డేల్లో 50 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వెస్టిండిస్‌ ఆరంభంలోనే ఎవిన్‌ లూయిస్‌(2) వికెట్‌ను కోల్పోయింది. క్రిస్‌ వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి లూయిస్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్‌ హోప్‌‌తో కలిసి క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు.

అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా క్రిస్ గేల్‌(36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫ్లంకెట్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని భారీ షాట్‌కు యత్నించి బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన రెండో బంతికి తడబడుతున్న షాయ్ హోప్(11) ఎల్బీగా వెనుదిరిగాడు.

{headtohead_cricket_2_8}

దీంతో 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత నికోలస్ పూరన్(63), హెట్ మెయిర్(39) రాణించినప్పటికీ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్(9), ఆండ్రీ రస్సెల్(21), కార్లోస్ బ్రాత్ వైట్(14) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో విండిస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Friday, June 14, 2019, 22:19 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+