
హైదరాబాద్: సొంతగడ్డపై ఇంగ్లాండ్ బౌలర్లు సత్తా చాటారు. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లీషు బౌలర్లు సత్తా చాటారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 233 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శ్రీలంక జట్టులో ఏంజెలో మ్యాథ్యూస్ 115 బంతుల్లో 85(5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా అవిష్కా ఫెర్నాండో 39 బంతుల్లో 49(6 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ 68 బంతుల్లో 46(2ఫోర్లు) ఫరవాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు మూడు పరుగుల వద్దే ఓపెనర్లు కరుణరత్నే(1), కుశాల్ పెరీరా(2) పెవిలియన్ చేరారు. ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు.
వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కి 59 పరుగులు జోడించిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) ఔటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫెర్నాండో... రషీద్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు.
అయితే, జట్టు స్కోరు 133 పరుగుల వద్ద కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జీవన్ మెండిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో ధనంజయ డిసిల్వా(29) ఫర్వాలేదనిపించాడు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
{headtohead_cricket_2_7}