అరుదైన ఘనత: రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్‌ల సరసరన డేవిడ్ వార్నర్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 61 బంతుల్లో 53 పరుగులు చేయడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తద్వారా ఓ ప్రపంచకప్‌లో 500 పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా, ఆస్ట్రేలియా తరపున మూడో ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 2007 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ దిగ్గజాలు మాథ్యూ హెడెన్(659), రికీ పాంటింగ్(539) ఈ ఘనత సాధించారు.

పాంటింగ్, హెడెన్‌ల సరసన వార్నర్
తాజాగా వార్నర్ కూడా వారి సరసన నిలిచాడు. ఇక, వార్నర్‌తో పాటు మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా ఈ మెగా టోర్నీలో 500 పరుగుల జాబితాలో చేరడానికి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచాడు. ఇక, ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.

2003 ప్రపంచకప్‌లో సచిన్
2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. బహుశా ఈ వరల్డ్‌కప్‌లో సచిన్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ప్రపంచకప్‌లో 500కుపైగా పరుగులను రెండు సార్లు నమోదు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అరుదైన గుర్తింపు పొందాడు.

రెండు సార్లు 500కుపైగా పరుగులు
2003 వరల్డ్‌కప్‌తో పాటు 1996 వరల్డ్‌కప్‌లో సైతం సచిన్ 500 పరుగుల మార్కుని అందుకున్నాడు. ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే...
* సచిన్ టెండూల్కర్ - 673 (2003)
* మాథ్యూ హెడెన్ - 659 (2007)
* మహిళ జయవర్దనే - 548 (2007)
* మార్టిన్ గుప్టిల్ - 547 (2015)
* కుమార సంగక్కర - 541 (2015)
* రికీ పాంటింగ్ - 539 (2007)
* తిలకరత్నే దిల్షాన్ - 500 (2011)
* డేవిడ్ వార్నర్ - 500* (2019)

వార్నర్-ఫించ్ జోడీ అరుదైన రికార్డు
వార్నర్-ఫించ్ జోడీ ఈ ప్రపంచకప్‌లో మరో రికార్డును నమోదు చేశారు. ఒకే ప్రపంచకప్‌లో 5సార్లు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచారు. గతంలో క్రిస్ ట్రేవర్-గ్రేమి ప్లవర్ జోడి(1983), డేవిడ్ బూన్-జెఫ్ మార్ష్ జోడి (1987,1992), అమీర్ సోహైల్-సయీద్ అన్వర్ జోడి(1996), ఆడం గిల్‌క్రిస్ట్-మాథ్యూ హెడెన్ జోడి (2003)లో నాలుగు సార్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications