Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్: టాస్ గెలిచిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ బ్యాటింగ్

CWC 2019: Bangladesh vs New Zealand LIVE Score: New Zealand win the toss and opts to bowl first

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్‌కు ఇది 200వ వన్డే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ సందర్భంగా విలియమ్సన్ మాట్లాడుతూ పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉందని.. అందుకే తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. బంగ్లా కెప్టెన్ మొర్తాజా మాట్లాడుతూ ఒకవేళ తన టాస్ గెలిచినా ఫీల్డింగ్‌నే ఎంచుకొనే వాడినని అన్నాడు. మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్‌కు ఇది 200వ వన్డే.బంగ్లాదేశ్‌ తరఫున 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్‌ గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తజా (208 మ్యాచ్‌లు), ముష్ఫికర్‌ రహీమ్‌ (206 మ్యాచ్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

1
43652

టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు చెరొక మ్యాచ్ ఆడి విజయం సాధించాయి. తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించగా... దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

{headtohead_cricket_4_10}

వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా... అన్నింట్లోనూ న్యూజిలాండే విజయం సాధించింది. మొత్తంగా బంగ్లాదేశ్, కివీస్‌లు 35 వన్డేలు ఆడాయి. న్యూజిలాండ్‌ 24 గెలవగా బంగ్లా 10 గెలిచింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. చివరి 3 మ్యాచ్‌ల్లో కివీస్‌ విజయం సాధించింది.

జట్ల వివరాలు:
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), జిమ్మీ నీషమ్, కొలిన్ డి గ్రాండ్ హోమ్, మిచెల్ సట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గుసన్

బంగ్లాదేశ్: మష్రఫె మొర్తాజా(కెప్టెన్), సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకీబ్ ఉల్ హాసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మద్ మిథున్, మహ్మదుల్లా, మొసద్దీక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్

Story first published: Wednesday, June 5, 2019, 18:09 [IST]
Other articles published on Jun 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+