For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షహీన్ అఫ్రిదికి చోటు: ఆసీస్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

CWC 2019: Australia vs Pakistan Live Score: Pakistan opt to bowl; Shaheen Afridi in

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాంటన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ మాట్లాడుతూ షాదబ్ ఖాన్ స్థానంలో షహీన్ అఫ్రిదికి చోటు కల్పించినట్లు చెప్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నలుపు రంగు బ్యాడ్జిలను ధరించి ఆడనున్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక, పాకిస్థాన్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆత్మ విశ్వాసంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బరిలోకి దిగుతోంది.

1
43660

విండిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తడబడినా... ఆ తర్వాత ఆతిథ్య జట్టుపై పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీని ఘనంగా ఆరంభించినప్పటికీ, కోహ్లీసేన చేతిలో పరాజయంతో కాస్త నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆస్ట్రేలియా మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.



జట్ల వివరాలు:

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, రిచర్డ్‌సన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, అసిఫ్ అలీ, షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్, హసన్ అలీ, షాదబ్ ఖాన్, మహ్మద్ ఆమీర్

{headtohead_cricket_1_5}

Story first published: Wednesday, June 12, 2019, 14:51 [IST]
Other articles published on Jun 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+