Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్: ‘బాప్‌రే బాప్’ కొత్త 'మౌకా-మౌకా' యాడ్ ఇదే (వీడియో)

ICC Cricket World Cup 2019 : Mauka Mauka Ad Is Back With Father’s Day Twist For India Pak Match
CWC 2019: Another India-Pakistan game, another ‘Mauka Mauka’ ad, another effort to stoke aggression

హైదరాబాద్: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌‌కు ఉంటే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్‌ 16న తలపడనున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 'మౌకా మౌకా' టీవీ యాడ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఐసీసీ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పుడు తలపడినా.. ఈ మౌకా-మౌకా యాడ్ ఎంతో పాపులర్ అయ్యేది. గత యాడ్‌లో పాక్ జట్టు జెర్సీని ధరించిన ఓ అభిమాని తమ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకుందామని టపాకాయలు తీసుకొస్తాడు.

అయితే, మ్యాచ్‌లో ఓడిపోవడంతో వాటిని తీసుకెళ్లి వచ్చే వరల్డ్‌కప్ కోసం దాచిపెడతాడు. అయితే, ఈసారి జూన్ 16 ఫాదర్స్ డే కావడంతో స్టార్ స్పోర్ట్స్ కాస్త భిన్నంగా యాడ్‌ని రూపొందించింది. ఈ యాడ్ అతిగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ చూసిన వారు 'బాప్‌రే బాప్' అంటారని పేర్కొంటూ 'హ్యాపీ ఫాదర్స్ డే' అని స్టార్ట్‌ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది.

కాగా, వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాదే పైచేయి. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఆరుసార్లు తలపడగా అన్నీ సార్లు టీమిండియానే విజయం సాధిస్తూ వస్తోంది. 1992, 1996, 1999, 2003, 2015లలో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏడోసారి.

మరోవైపు భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది. ఈ యాడ్‌లో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ సంఘ‌ట‌న‌ను వ్యంగ్యంగా చూపుతూ రూపొందించింది. అందులో అచ్చం అభినంద‌న్‌లాగే ఉన్న ఓ వ్య‌క్తి టీమిండియా జెర్సీని ధరించాడు.

టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్య‌క్తిని అడిగితే.. ఐయామ్ సారీ నేనేమీ చెప్ప‌కూడ‌దంటూ ఆ వ్య‌క్తి అంటాడు. ఇక చివ‌ర‌గా టీ క‌ప్‌తో వెళ్తుంటే.. ఆ క‌ప్పును ఎక్క‌డికి తీసుకు వెళ్తున్నావంటూ లాగేసుకుంటారు. ఇందుకు సంబంధించిన యాడ్ మీకోసం...

Story first published: Tuesday, June 11, 2019, 19:22 [IST]
Other articles published on Jun 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+