Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆప్ఘనిస్థాన్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

CWC 2019, Afghanistan vs New Zealand Live Score: Kane Williamson has opted to bowl against Afghanistan in Taunton

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం ఆప్ఘనిస్థాన్‌-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాంటన్‌లోని ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ "బౌలింగ్ ఎంచుకున్నాం. వికెట్ చాలా బాగుంది. ఈ మ్యాచ్‌కి ముందు రెండు మ్యాచుల్లో విజయం సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రౌండ్ పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం" అని అన్నాడు.

ఆప్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ మాట్లాడుతూ "మేం టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకొనే వాళ్లం. వికెట్ చాలా బాగుంది. మేం ఈరోజు మంచి క్రికెట్ ఆడాలి. జట్టులో మూడు మార్పులు చేశాం. మొదటి 10 ఓవర్లలో నిలకడగా బ్యాటింగ్ చేయాలి" అని అన్నాడు. న్యూజిలాండ్ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.

1
43656

మరోవైపు ఆప్ఘనిస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌లో రెండు విజయాలు, నాలుగు పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన ఉన్న న్యూజిలాండ్ జట్టు చిట్టచివరన ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడుతుంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న న్యూజిలాండ్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది.

{headtohead_cricket_95_4}

టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌పై జరిగిన రెండో పోరులో తీవ్రంగా శ్రమించింది. మరోవైపు ఒకటి రెండైనా సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలున్న ఆప్ఘనిస్థాన్ జట్టు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తేలిగ్గా తలొంచింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కాస్త పోరాడింది.

Story first published: Saturday, June 8, 2019, 18:42 [IST]
Other articles published on Jun 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+