షకిబ్‌ అజేయ సెంచరీ.. విండీస్‌పై బంగ్లా విజయం

ICC Cricket World Cup 2019 : Bangladesh Defeat West Indies By 7 Wickets || Match Highlights
CWC 19, West Indies vs Bangladesh: Shakib Al Hasan, Liton Das guide, Bangladesh beat West Indies by seven wickets

సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌ పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. పంచకప్‌లో భాగంగా సోమవారం టాంటాన్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. 322 పరుగుల లక్ష్యంను బంగ్లా బ్యాట్స్‌మన్‌ ఆడుతూ పాడుతూ మరో 51 బంతులు మిగిలుండగానే ఛేదించారు. బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (124 నాటౌట్‌; 99 బంతుల్లో 16ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విండీస్‌ బౌలర్లపై దాడి:

విండీస్‌ బౌలర్లపై దాడి:

భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (48; 53 బంతుల్లో 6×4), సౌమ్య సర్కార్‌ (29; 23 బంతుల్లో 2×4, 2×6) ఇన్నింగ్స్ మొదటి నుంచే విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ జోడి తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించాక సర్కార్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకిబ్‌ స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. విండీస్‌ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడాడు.

విండీస్‌ పైచేయి:

విండీస్‌ పైచేయి:

అయితే కొద్ది తేడాలో తమీమ్‌, ముష్ఫికర్‌ (1) వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. ఇక్కడే బంగ్లాపై విండీస్‌ పైచేయి సాధించింది. కానీ జోరుమీదున్న షకిబ్‌కు లిటన్‌ దాస్ తోడవడంతో బంగ్లా బ్యాటింగ్‌ సునాయాసంగా సాగింది. విండీస్‌కు సరైన స్పిన్నర్లు లేకపోవడంతో మధ్య ఓవర్లలో కూడా ప్రభావం కనిపించలేదు. ఈ జోడి ఆడుతూ పాడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో బంగ్లా లక్ష్యం దిశగా సాగింది.

నాలుగో వికెట్‌కు 189 పరుగులు:

నాలుగో వికెట్‌కు 189 పరుగులు:

థామస్‌ బౌలింగ్‌లో ఓ కవర్‌ డ్రైవ్‌తో 83 బంతుల్లోనే షకిబ్‌ సెంచరీ చేసాడు. ఇక గాబ్రియెల్‌ వేసిన ఓ ఓవర్లో లిటన్‌ దాస్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో విండీస్‌ బౌలర్లు ఏమీ చేయలేని స్థితికి వచ్చారు. కెప్టెన్ హోల్డర్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం దక్కలేదు. షకిబ్‌, లిటన్‌ జోడీ నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి లక్ష్యాన్ని పూర్తి చేసింది. విండీస్‌ బౌలర్లలో రసెల్‌, థామస్‌లకు చెరో వికెట్‌ దక్కింది. సెంచరీతో పాటు రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది.

హోల్డర్‌ మెరుపులు:

హోల్డర్‌ మెరుపులు:

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విండీస్‌ ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ 70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెట్‌ మెయిర్‌ (50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో హోల్డర్‌ (33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌, సైఫుద్దీన్‌లు తలో మూడు వికెట్లు తీశారు.

1
43666
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 18, 2019, 7:55 [IST]
Other articles published on Jun 18, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more