For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా.. ఔట్‌ కాలేదు!!

ICC Cricket World Cup 2019 : Oshane Thomas Is Given NOT OUT Despite Hitting The Wickets With His Bat
CWC 19, West Indies vs Bangladesh: Oshane Thomas is given NOT OUT despite hitting the wickets with his bat

అనుకోకుండా బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా ఔట్‌ కాలేదు. ఈ విచిత్ర ఘటన పంచకప్‌లో భాగంగా సోమవారం టాంటాన్‌ మైదానం వేదికగా బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్‌ అనుకోకుండా వికెట్లను బ్యాట్‌తో కొట్టినా లేదా బ్యాట్స్‌మన్‌ అదుపుతప్పి వికెట్లను తాకినా హిట్‌ వికెట్‌గా అవుట్ ఇస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్నటి మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా అంపైర్ ఔట్‌ ఇవ్వలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విండీస్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌ 49 ఓవర్‌ వేస్తున్నాడు. ఈ ఓవర్ ఐదో బంతిని ఆఫ్‌ సైడ్‌ యార్కర్‌గా వేయగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న ఒషానే థామస్‌ ఓ అడుగు ముందుకేసి షాట్ ఆడగా బంతి కాస్తా కీపర్‌ రహీమ్‌ చేతుల్లోకి వెళ్లింది. షాట్ ఆడిన అనంతరం థామస్‌ క్రీజు లోపలికి జరిగే క్రమంలో వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. బెయిల్స్‌ కూడా కింద పడ్డాయి.

దీనిపై ఫీల్డ్‌ అంపైర్లు కొద్దిసేపు చర్చించిన అనంతరం థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశారు. థర్డ్‌ అంపైర్‌ ఇది ఔట్‌ కాదని తేల్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బాట్స్‌మన్‌ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్‌ ఇవ్వలేదని ఆలోచనలో పడ్డారు. 'థామస్‌ షాట్‌ ఆడిన తర్వాతే బ్యాట్‌ వికెట్లను తాకడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడని' తెలుసుకుని ఆశ్చర్యం నుండి బయటికి వచ్చారు. ఈ మ్యాచులో థామస్‌ 11 బంతులు ఆడి 6 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా విజయం సాదించింది.

Story first published: Tuesday, June 18, 2019, 10:27 [IST]
Other articles published on Jun 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+