Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ప్రీత్ బుమ్రాతో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటి అనుపమ

Is Anupama In Love With Cricketer Bumrah ? || Filmibeat Telugu
CWC 19: Tollywood Actress Anupama Parameswaran responds to the rumours of dating India Bowler Jasprit Bumrah

టీమిండియా స్టార్ పేసర్, వరల్డ్ నంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఇండియన్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. బుమ్రా తన ట్విట్టర్ అకౌంట్లో కేవలం అనుపమను మాత్రమే ఫాలో అవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా ఆ వార్తలపై స్పందించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మంచి ఫ్రెండ్ మాత్రమే:

మంచి ఫ్రెండ్ మాత్రమే:

'జస్ప్రీత్ బుమ్రా తెలియదని చెప్పను. అతను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఇంతకుమించి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. మేం డేటింగ్‌లో కూడా లేము. ఇప్పటితోనైనా నాపై వస్తున్న రూమర్లు ఆగుతాయని ఆశిస్తున్నా' అని అనుపమ పరమేశ్వరన్ ఘాటుగా స్పందించారు.

రాక్షసుడు సినిమాలో:

రాక్షసుడు సినిమాలో:

'ప్రేమమ్' సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమ.. అనతి కాలంలోనే దక్షిణ సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. తెలుగులో ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి 'రాక్షసుడు' సినిమాలో నటిస్తోంది. తమిళ సినిమా 'రాట్సన్'కు ఇది రీమేక్‌.

ఇంగ్లాండ్ పర్యటనలో:

ఇంగ్లాండ్ పర్యటనలో:

బుమ్రా ప్రస్తుతం ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి పటిష్ట జట్లను తన మార్క్ బౌలింగ్‌తో కట్టడి చేసాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో బుమ్రా టీమిండియాకు వెన్నెముకగా ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను శనివారం అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు మధ్యలో ఐదు రోజుల విరామం ఉండడంతో బుమ్రా సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యాడు.

గతంలో రాశి ఖన్నాతో:

గతంలో రాశి ఖన్నాతో:

బుమ్రాతో రాశి ఖన్నా డేటింగ్ చేస్తోందని గతంలో వార్తలు రాగా.. వాటిని వెంటనే ఖండించింది రాశి. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడగానే ఇప్పుడు బుమ్రాతో అనుపమని లింక్ చేయడం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అనుపమ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి.. మళ్ళీ ఎవరితో లింక్ చేస్తారో చూడాలి. ఇంతకు సోషల్ మీడియా హీరోయిన్లకు ప్లస్ అవుతోందా? లేక మైనస్ అవుతోందా? అర్థం కావడం లేదు.

Story first published: Tuesday, June 18, 2019, 11:42 [IST]
Other articles published on Jun 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+