Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవిష్క ఫెర్నాండో సెంచరీ.. వన్డే ఫార్మాట్‌, ప్రపంచకప్‌లో అరుదైన ఘనత

CWC 19, Sri Lanka vs West Indies: Sri Lanka’s Avishka Fernando becomes third-youngest to score an ODI World Cup ton

చెస్టర్ లీ స్ట్రీట్‌ వేదికగా సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ అవిష్క ఫెర్నాండో సెంచరీ (103 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసాడు. దీంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక తరఫున అత్యంత పిన్న వయసు (21 ఏళ్ల 87 రోజులు)లో సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా అవిష్క రికార్డుల్లోకి ఎక్కాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 తొలి వన్డే సెంచరీ:

తొలి వన్డే సెంచరీ:

అంతకుముందు లంక మాజీ కెప్టెన్ దినేష్ చండిమల్‌ (20 ఏళ్ల 199 రోజుల వయసు), స్టార్ ఓపెనర్ ఉపుల్‌ తరంగా (20 ఏళ్ల 212 రోజుల వయసు)లు పిన్న వయసులో వన్డే సెంచరీలు సాధించారు. ఈ సెంచరీ ఫెర్నాండోకు తొలి వన్డే సెంచరీ. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ సాధించిన మొదటి సెంచరీ కూడా ఇదే కావడం విశేషం.

మూడో క్రికెటర్‌గా:

మూడో క్రికెటర్‌గా:

మరోవైపు ప్రపంచకప్‌లో కూడా అత్యంత పిన్న వయసు (21 ఏళ్ల 87 రోజులు)లో సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా అవిష్క గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఐర్లాండ్ బ్యాట్స్‌మన్‌ పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 196 రోజుల వయసు), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (21 ఏళ్ల 76 రోజుల వయసు)లు పిన్న వయసులో ప్రపంచకప్‌ సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లీ (22 ఏళ్ల 106 రోజులు), సచిన్ (22 ఏళ్ల 300 రోజులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2016లో అరంగేట్రం:

2016లో అరంగేట్రం:

2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అవిష్క ఫెర్నాండో అరంగేట్రం చేసాడు. ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడి డకౌట్‌ అయ్యాడు. ఇప్పటివరకూ తొమ్మిది వన్డేలు ఆడిన ఫెర్నాండో 328 పరుగులు చేసాడు. ఫెర్నాండో ఇప్పటివరకు ఒక అర్ధ సెంచరీ, ఒక సెంచరీ చేసాడు.

శ్రీలంక విజయం:

శ్రీలంక విజయం:

సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో సెంచరీ సాధించగా, కుశాల్‌ పెరీరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. జేసన్ హోల్డర్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి పోరాడి ఓడింది. నికోలస్‌ పూరన్‌ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ, అలెన్‌ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. మలింగకు 3 వికెట్లు దక్కాయి.

1
43682
Story first published: Tuesday, July 2, 2019, 14:20 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+