న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం.. దేవుడు కరుణిస్తే సెమీస్‌ చేరుతాం

CWC 19, Pakistan vs Bangladesh: Fans amused as Sarfaraz Ahmed says Pakistan will try to post 500 vs Bangladesh

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడబోయే చివరి మ్యాచ్‌లో 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం, దేవుడు కరుణిస్తే సెమీస్‌ చేరుతాం అని పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీమిండియా చేతిలో ఓడిపోవడంతో బంగ్లా సెమీస్ ఆశలు ఆవిరవ్వగా.. పాకిస్థాన్‌కు మాత్రం ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఈ రోజటి మ్యాచ్‌లో పాక్ టాస్ నెగ్గి మొదటగా బ్యాటింగ్ చేసి 316 పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీ ఫైనల్‌ రేసులో ఉంటుంది. ఒకవేళ టాస్‌ నెగ్గకపోతే పాకిస్థాన్‌ ఆశలు గల్లంతైనట్టే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

500 పరుగులు చేస్తాం:

500 పరుగులు చేస్తాం:

శుక్రవారం సర్ఫరాజ్‌ అహ్మద్‌ మీడియాతో మాట్లాడుతూ... 'బంగ్లా మ్యాచ్‌లో 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం. మేము 500 లేదా 400 పరుగులు చేస్తే ప్రత్యర్థిని 50 పరుగులలోపే కట్టడి చేయాలి. ఇది కష్టమైనప్పటికీ.. ప్రయత్నిస్తాం. ఏదైనా అద్భుతం జరిగి దేవుడు కరుణిస్తే తప్ప తాము సెమీస్‌ చేరలేం. అంతటి ఘన విజయం సాధించడం వాస్తవికంగా కష్టతరమైనప్పటికీ.. గెలవడానికి మాత్రం ప్రయత్నిస్తాం' అని సర్ఫరాజ్‌ తెలిపాడు. సర్ఫరాజ్‌ వ్యాఖ్యలతో పాక్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 కివీస్‌కు రన్‌రేట్‌ అధికం:

కివీస్‌కు రన్‌రేట్‌ అధికం:

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. నాలుగు గెలిచి, మూడు ఓడిపోయింది. మరొక మ్యాచ్‌ రద్దైంది. దీంతో 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బంగ్లాపై గెలిచినా.. 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. అయితే నెట్‌ రన్‌రేట్‌ ఇప్పటికే కివీస్‌కు +0.175 ఉండడం, పాకిస్థాన్‌కు -0.792గా ఉండడంతో పాక్‌ సెమీస్‌ చేరే అవకాశం చాలా తక్కువ.

సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే:

సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే:

సాంకేతికంగా సెమీ ఫైనల్‌ రేసులో నిలిచిన పాకిస్థాన్‌.. దాన్ని నిజం చేయాలంటే చివరి లీగ్‌ మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించాల్సి ఉంటుంది. విజయం అంటే మామూలు విజయం కాదు.. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉండాలి. న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించి పాకిస్థాన్‌ సెమీస్‌ చేరాలంటే సంచలనం సృష్టించాల్సిందే. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. మొదటగా పాక్ 350 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 311 పరుగుల తేడాతో ఓడించాలి. 400 పరుగులు చేసిన తర్వాత 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. ఇక 450 పరుగులు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను 321 పరుగుల తేడాతో ఓడించాలి.

Story first published: Friday, July 5, 2019, 12:01 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X