న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్విటర్‌లో వైరల్‌.. స్టేడియం బయట కొట్టుకున్న పాక్, ఆఫ్గన్ అభిమానులు (వీడియో)

CWC 19, Pakistan beat Afghanistan: Unruly fans fight, invade pitch after Pakistan beat Afghanistan in thriller

హెడింగ్లీలోని లీడ్స్ మైదానంలో శనివారం ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ చూడడానికి మైదానానికి ఇరు జట్ల అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే కొందరి అభిమానులకు టిక్కెట్లు దొరకక బయటే వేచి ఉన్నారు. అలా బయట ఉన్న పాక్, ఆఫ్గన్ అభిమానుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఒకరిపైఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వారిపై నిషేదం:

మ్యాచ్‌ జరుగుతుండగా రెండు దేశాల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. అంతేకాదు స్టేడియం వెలుపల ఉన్న ఆస్తులను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే ఇరు దేశాల క్రికెట్ అభిమానులను శాంతింపజేశారు. గొడవకు కారణమైన వారిని బయటికి పంపించి వేశారు. ప్రపంచకప్‌మిగతా మ్యాచ్‌లు చూడకుండా ఐసీసీ వారిపై నిషేదం విధించింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని ఐసీసీ స్పష్టం చేసింది.

ఆఫ్గనిస్థాన్ గెలిచే సమయంలో:

ఆఫ్గనిస్థాన్ గెలిచే సమయంలో:

పాకిస్తాన్‌కు చెందిన ఓ వృద్ధ అభిమానిపై అఫ్గాన్‌ అభిమానులు నోరుజారడంతో ఈ గొడవ జరినట్టు సమాచారం తెలుస్తోంది. మ్యాచ్‌లో ఓ దశలో ఆఫ్గనిస్థాన్ గెలిచే అవకాశం ఉన్న సమయంలోనే ఈ గొడవ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

సెమీస్‌ ఆశలు సజీవం:

సెమీస్‌ ఆశలు సజీవం:

టాస్‌ గెలిచి మొదటగా బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ ఏడు వికెట్లు కోల్పోయి 49.4 ఓవర్లలో లక్ష్యన్ని ఛేదించింది. ఓడిపోయే దశలో ఇమాద్‌ వసీమ్‌ (49 నాటౌట్‌; 54 బంతుల్లో 5×4) పోరాడడంతో పాకిస్థాన్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. మరోవైపు అఫ్గాన్‌ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది.

Story first published: Sunday, June 30, 2019, 14:19 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X