న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ ఢీ.. రేస్‌లో నిలవాలంటే పాక్ గెలవాల్సిందే

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అపజయమే లేకుండా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ సెమీఫైనల్స్ బెర్తుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా.. న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మరోవైపు పాక్ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచిన పాక్ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో పాక్ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్ మ్యాచ్ గెలవాల్సిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆత్మవిశ్వాసంతో పాక్:
గత మ్యాచ్‌లో పటిష్ఠ దక్షిణాఫ్రికాపై గెలిచిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగనుంది. ఓపెనర్లు ఇమాముల్, ఫఖర్ జమాన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ రాణిస్తున్నారు. సఫారీలపై హారిస్ సొహైల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సర్ఫరాజ్ పరుగులు చేస్తే బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. స్టార్ పేసర్ మహ్మద్ ఆమిర్, షాదాబ్ ఖాన్, వహాబ్ రియాజ్, షాహిన్ షా అఫ్రీదితో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. ప్రధాన పేసర్ ఆమిర్ సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.

విలియమ్సన్ ఫామ్ :
న్యూజిలాండ్‌కు ఓపెనర్లు గప్టిల్, మున్రో ఫామ్ ఆందోళన పరుస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ విభాగానికి వెన్నుముకగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టాపార్డర్ విఫలమైనా.. విలియమ్సన్ (148) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాపై అజేయ శతకంతో ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టేలర్ నిలకడ రాణిస్తున్నాడు. లాథమ్ ఫామ్ అందుకోలేదు. ఆల్ రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ ఉన్నారు. పేసర్లు బౌల్ట్, ఫెర్గూసన్ అద్భుతంగా రాణిస్తున్నారు. అన్ని విభాగాల్లో కివీస్ పటిష్టంగానే ఉంది.

ముఖాముఖి రికార్డు:
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు జరగ్గా.. 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, కివీస్ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా.. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మొత్తం 8 మ్యాచ్‌లాడగా.. ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్ గెలుపొందాయి.
Teams (Probable XI):
Pakistan: Fakhar Zaman, Imam-ul-Haq, Babar Azam, Mohammad Hafeez, Haris Sohail, Sarfaraz Ahmed (c&wk), Imad Wasim, Wahab Riaz, Shadab Khan, Mohammad Amir, Shaheen Afridi.
New Zealand: Martin Guptill, Colin Munro, Kane Williamson (c), Ross Taylor, Tom Latham (wk), James Neesham, Colin de Grandhomme, Mitchell Santner, Trent Boult, Matt Henry, Lockie Ferguson
{headtohead_cricket_4_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications