దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ గ్లౌజ్‌లు

ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ (122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధోనీ దేశభక్తి:
ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ధోనీ ధరించిన గ్లౌజ్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వికెట్ కీపింగ్ చేస్తూ.. ముదురు పచ్చరంగు గ్లౌజులు ధరించాడు. అయితే ఆ కీపింగ్ గ్లౌజ్‌లపై ఓ ప్రత్యేక చిహ్నం ఉంది. ఆ చిహ్నం పారామిలిటరీ దళాలకు చెందిన బలిదాన్ బ్యాడ్జి. దీంతో దేశంపై తన అభిమానాన్ని ధోనీ చాటుకున్నాడు.
పుల్వామా ఉగ్రదాడి సమయంలో కూడా:
మ్యాచ్ సందర్భంగా ఇది గమనించిన ధోనీ అభిమానులు ఆ గ్లౌజుల ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇండియన్ ఆర్మీపై అభిమానాన్ని చూపిన ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకుముందు కూడా ధోనీ ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకి ఆర్మీ క్యాపులు అందించాడు. ఆ మ్యాచ్‌లో ఆటగాళ్లు ఆ క్యాపులు ధరించే ఆడారు.
పారాచూట్ డైవింగ్:
2011లో ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. ఆ సమయంలో అతను ఆగ్రాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్‌లో భాగంగా ధోనీ ఐదు సార్లు పారాచూట్ డైవింగ్ కూడా చేశాడట. ఈ వన్డేలో ధోనీ 34 పరుగులు చేసాడు. కీలక మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి రోహిత్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ప్రొటీస్ ఇన్నింగ్స్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్ కూడా చేశాడు. టీంఇండియా తన తరువాత మ్యాచ్‌ను జూన్ 9న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications